* నిరసనగా నవంబర్ 1న ఆందోళనలు
* అన్ని రాజకీయ పార్టీలు పాల్గొనాలని మంద కృష్ణ మాదిగ పిలుపు
ఆకేరు న్యూస్, హనుమకొండ : జస్టిస్ గవాయ్ పై దాడిని సుమోటోగా స్వీకరించాలని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పద్మ శ్రీ మంద కృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. పట్టణంలోని హరిత హోటల్లో శనివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సుప్రీంకోర్టు సిజే పై దాడికి నిరసనగా నవంబర్1 హైదరాబాద్ లో ఆందోళన కార్యక్రమాలు చేపడుతామన్నారు. న్యాయవస్థపై నమ్మకం ఉన్న ప్రతిఒక్కరు, రాజకీయ పార్టీలు నిరసన కార్యక్రమాల్లో పాల్గొనాలని సూచించారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గవాయ్ పై న్యాయవాది దాడి ఎందుకు చేసారో ఇప్పటివరకు జవాబు లేదన్నారు. దాడి చేసిన వ్యక్తి పట్ల చట్టపరమైన చర్యలు ఏ ఒకటి తీసుకోకపోవడం సరైనదేనా..? అని ప్రశ్నించారు. దేశంలో ప్రజాస్వామ్యం ఉంది అంటే అది న్యాయ వ్యవస్థే అని.. ప్రజల హక్కులను కాపాడుతుంటే దాడులు ఎందుకు చేస్తున్నట్లు చెప్పాలని తెలిపారు. ఈ దాడి సంఘటనపై ప్రధానమంత్రి ఎందుకు స్పందించడం లేదని.. సిజేఐ పై దాడి కులంపై దాడి అని చెప్పారు. సిజే దళితుడు కావడం వల్లే తన సొంత రాష్టం మహారాష్ట్రలో ప్రొటోకాల్ పాటించలేదని మండిపడ్డారు. జార్ఖండ్ లో ఒక కేసులో జడ్జి, న్యాయవాది మధ్యలో ఘర్షణ జరిగితేనే సుమోటోగా కేసు నమోదు చేశారు. సిజే మీద దాడి జరిగితే సుమోటో కేసు ఎందుకు స్వీకరించలేదన్నారు. నిజామాబాద్ లో రౌడీషిటర్ రియాజ్ ఒక కానిస్టేబుల్ ను హత్య చేసిన రియాజ్ అరెస్ట్ చేసి ,పోలీసులు ఎన్ కౌంటర్ చేశారు. ఈ సమయంలో మానవహక్కుల కమిషన్ సుమోటో కేసు నమోదు చేశారని గుర్తు చేశారు. దళిత సంఘాల నాయకులు పాల్గొన్నారు.
……………………………………………..
