* రోజుకో అవినీతి.. పూటకో కుంభకోణం
* మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : ఇందిరమ్మ రాజ్యంలో రోజుకో అవినీతి పూటకో కుంభకోణం అని మాజీ మంత్రి బీఆర్ ఎస్ నేత వేముల ప్రశాంత్ రెడ్డి ఆరోపించారు. శనివారం ఆయన తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడారు.అవినీతి పంపకాల్లో మంత్రుల మధ్య వివాదాలు తలెత్తి ముఖ్యమంత్రి దృష్టికి పోతున్నాయని ఆరోపించారు. ముఖ్య మంత్రితో సహా మంత్రులందరూ అవినీతి సొమ్మను పంచుకొని తింటున్నారని అన్నారు. దక్కన్ సిమెంట్ యాజమాన్యాన్ని గన్ తో పెట్టి బెదిరించడానికి కారణం సీఎం అని స్వయంగా మంత్రి కూతురే ఆరోపించిందని వేముల అన్నారు….మద్యం సీసాల హోలోగ్రాం కుంభకోణం లో సీఎం మంత్రి వివాదం లో అధికారిని బలి చేశారని అన్నారు. హైబ్రిడ్ అన్యుటీ మోడ్ (హమ్ )టెండర్ల లో 8 వేల కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని వేముల అన్నారు. హమ్ లో కిలోమీటర్ కు 85 శాతం అంచనా వ్యయం పెంచారని,..తొమ్మిది వేల కోట్ల రూపాయల తో పూర్తి అయ్యే రోడ్ల కు పదిహేడు వేల కోట్ల రూపాయలకు టెండర్లు పిలిచారని ఆరోపించారు. 8 వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఈ ప్రభుత్వం లూటీ చేస్తోందన్నారు. ఇందులో పెద్ద అవినీతి జరుగుతున్నందున కేంద్ర దర్యాప్తు సంస్థలు తక్షణమే జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులు ..కిషన్ రెడ్డి ,బండి సంజయ్ కు ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా హమ్ టెండర్ల పై సిబిఐ దర్యాప్తు చేయించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు కాలేరు వెంకటేష్ ,డాక్టర్ కె .సంజయ్ ,గ్రంధాలయ సంస్థ మాజీ చైర్మన్ ఆయాచితం శ్రీధర్ ,బీసీ కమిషన్ మాజీ సభ్యుడు కె .కిషోర్ గౌడ్ పాల్గొన్నారు.
……………………………………….
