* ఎర్రిస్వామి స్టేట్మెంట్ ఆధారంగా దర్యాప్తు
* వైరల్‌గా మారిన బకైర్ శివశంకర్ విజువల్స్
* మద్యం మత్తులో పెట్రోల్ బంక్ వద్ద విన్యాసాలు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ :కావేరి బస్సు ప్రమాదంలో కీలక మలుపు చోటు చేసుకుంది. బైక్‌పై ఉన్న మరో వ్యక్తి ఎర్రిస్వామి స్టేట్మెంట్ కేసుకు ప్రధాన సాక్ష్యంగా మారింది. కర్నూలు బస్సు ప్రమాదానికి గురైన బకైర్ శివశంకర్ పెట్రోల్ బంక్ వద్ద విజువల్స్ వైరల్‌గా మారాయి. ప్రమాదం జరిగిన స్థలానికి ఈ పెట్రోల్ బంక్ 2 కిమీ దూరంలోనే ఉంది. మద్యం మత్తులో ఉన్న బైక్ శివశంకర్ పెట్రోల్ పోయించుకునేందుకు బంక్ వద్దకు వెళ్లాడు. పెట్రోల్ పోసేందుకు అక్కడ ఎవరూ లేకపోవడంతో రెండు మూడు సార్లు అరిచారు. అయినా అందులో ఉన్న సిబ్బంది రాకపోవడంతో బండి దిగి వారి వద్దకు వెళ్లాడు. తిరిగి వచ్చిన శివశంకర్ బండి ఒంటిచేత్తో గుడ్రంగా తిప్పాడు. అక్కడే వాహనం అదుపు తప్పి పడబోయాడు. అయినా.. స్పీడ్ పెంచి వెళ్లాడు. కొద్దిసేపటికే మృతి చెందాడు.
ఎర్రిస్వామి స్టేట్మెంట్తో కీలక మలుపు..
కావేరి బస్సు ప్రమాదంలో ఒక్కో విషయం వెలుగు చూస్తోంది. బస్సు ప్రమాదానికి బైకర్ శివశంకర్ కారణమనుకుంటున్న తరుణంలో మరో కోణం వెలుగు చూసింది. మద్యం మత్తులో ఉన్న శివశంకర్ ప్రమాదానికి కొద్ది దూరంలో ఉన్న పెట్రోల్ బంక్‌కు బైక్‌పై ఇద్దరు వెళ్లారు. తిరిగి వెళుతుండగా మద్యం మత్తుతో ఉన్నబైకర్ రోడ్ పక్కనున్న డీవైడర్‌ను బలంగా ఢీ కొట్టడంతో బండిపై ఉన్న ఇద్దరు కిందపడిపోయారు. శివశంకర్ అక్కడికక్కడే మృతి చెందాడు. రహదారిపై ఉన్న వాహనాన్ని బండి వెనకాల ఉన్న ఎర్రి స్వామి పక్కకు తీస్తుండగా కావేరీ బస్సు అతి వేగంగా వచ్చి బైక్‌ను ఈడ్చుకుంటూ వెళ్లింది. దీంతో రాపిడి మొదలై మంటలు చెలరేగాయి. మంటలు బస్సుకు అంటుకొని కాలి బూడిదై 21 మంది ప్రాణాలను బలితీసుకుంది. ఎర్రి స్వామి ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా తదుపరి దర్యాప్తు చేస్తున్నారు. బైక్‌పై వెళుతున్న శివశంకర్‌ను వెనకాల నుంచి వచ్చిన కావేరీ బస్సు ఢీకొట్టిందని భావించారు. ఎర్రి స్వామి స్టేట్మెంట్తో జరిగిన వాస్తవం వెలుగు చూసింది.
తల్లితో గోడవ పడి.. ఇంటి నుంచి వెళ్లిపోయి..
కర్నూల్ మండలం ప్రజానగర్‌కు చెందిన శివశంకర్ (22) గ్రానైట్ కంపెనీలో పని చేస్తున్నాడు. శివశంకర్ పెళ్లి విషయమై తన తల్లితో గొడవ పడి ఇంటి నుంచి వెళ్లిపోయాడు. ఇంటికి వెళ్లకుండానే మద్యం తాగుతూ తిరుగుతున్నాడు. సంఘటనకు కొద్ది సేపటి ముందు తన తల్లికి ఫోన్ చేసి మాట్లాడాడు. నేషనల్ హై వే 44 మీద కర్నూల్ పట్టణ శివారులో రాంగ్ రూంట్లో వస్తుండగా రహదారికి పక్కన ఉన్న డీవైడర్‌ను బలంగా ఢీకొట్టడంతో శివశంకర్ అక్కడికక్కడే మృతి చెందాడు. మరో వ్యక్తి తీవ్ర గాయాలతో బయటపడ్డాడు. తీవ్ర గాయాలైన ఎర్రిస్వామి తెలిపిన విషయాలే ప్రమాదానికి ప్రధానంగా నిలిచాయి.
………………………………………………………
