* అర్హత పొందినవి 81
* 23 మంది ఉపసంహరణ
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల బరిలో ప్రధాన పార్టీలు కాంగ్రెస్, బీఆర్ ఎస్, బీజేపీ తో సహా మొత్తం 58 మంది అభ్యర్థులు బరిలో మిగిలారు. ఈ మేరకు రిటర్నింగ్ అధికారి సాయిరాం ప్రకటించారు. ఎన్నికల సంఘం అభ్యర్థులకు గుర్తులను కూడా కేటాయించింది.బ్యాలెట్ పేపర్లో మొదటి స్థానంలో బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి కమలం గుర్తు ,రెండో స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ చేతి గుర్తు, మూడో స్థానంలో మాగంటి సునీత బీఆర్ ఎస్ తరపును కారు గుర్తు ఉంటుంది. ఈ సారి బ్యాలెట్ పేపర్ చాలా పెద్దగా ఉంటుంది.అయితే జూబ్లీ హిల్స్ చరిత్రలో ఇంతమంది పోటీచేయడం ఇదే తొలిసారి. 2009 లో జరిగిన ఎన్నికల్లో 13 మంది అభ్యర్థులు పోటీ చేయగా,2014 లో 21 మంది,2018లో 18 మంది 2023లో 19 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు.
………………………………………………
