* మంత్రులది ముగిసిన పంచాయితీ
* పిసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : మంత్రి కొండా సురేఖ కూతురు కొండా
సుస్మిత వ్యాఖ్యలపై పీసీసీ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్ స్పందించారు
ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన మీడియా తో మాట్లాడారు. మంత్రి కొండా సురేఖ కూతురు
కులాల పేరును ప్రస్తావించడం సరికాదన్నారు. మంత్రుల మధ్య పంచాయితీ
ఎప్పుడో సమసిపోయిందన్నారు. ఏదైనా సమస్యలు ఉంటే అంతర్గతంగా
చర్చించుకోవాలి కాని బహిర్గతం కాకూడదని మహేశ్ అన్నారు,
ఈ విషయం పార్టీ హై కమాండ్ వద్దకు చేరిందని పార్టీ హైకమాండ్
సీఎం తో చర్చించే అవకాశం ఉందని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి కూడా
ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలోనే ఉన్నారు. ఇటీవల పోలీసులు మంత్రి కొండా సురేఖ
ఇంటికి ఓఎస్ డీని అరెస్ట్ చేయడానికి వచ్చిన సందర్భంలో మంత్రి కూతురు
సీఎం రేవంత్ రెడ్డి,ఉత్తంకుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిల పేర్లు
ప్రస్తావించిన విషయం తెల్సిందే. ఈ నేపధ్యంలోనే మంత్రి కొండా దంపతులు సీఎం ఇంటికి
వెళ్లి వివరణ ఇచ్చుకున్నారు. మంత్రి కొండా సురేఖ మంత్రి పొంగులేటి తో కలిసి
మీడియాతో కూడా మాట్లాడారు
మెట్రోను అడ్డకుంటోంది కిషన్ రెడ్డే..
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హైదరాబాద్ లో మెట్రో ఫేస్-2 విస్తరణ పనులను అడ్డకుంటున్నారని పీసీసీ చీఫ్ ఆరోపించారు. కిషన్ రెడ్డి మెట్రో ఫేస్-2 పనులపై కేంద్రంపై ఎందుకు ఒత్తిడి చేయడం లేదని ప్రశ్నించారు. మెట్రో విస్తరణకి కేంద్ర ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఎందుకు ఇవ్వడం లేదని నిలదీశారు. మసిపూసి మారేడుకాయ చేసి మెట్రోఫేస్-2 ప్రాజెక్టు పనులని కేంద్ర ప్రభుత్వం అడ్డుకుంటుందని ఫైర్ అయ్యారు ,
………………………………………..
