* ఆత్మగౌరవ ర్యాలీ విజయవంతం చేయాలి
* M S P ములుగు జిల్లా కార్యదర్శి కాడపాక శ్యామ్ మాదిగ
ఆకేరు న్యూస్, ములుగు: ములుగు జిల్లా వెంకటాపూర్ మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ ఆవరణలో నవంబర్ 1న చలో హైదరాబాద్ విజయవంతం చేయాలని MRPS ,M S P వెంకటాపూర్ మండల నాయకులతో ఏర్పాటు చేసిన సమావేశం లో M S P ములుగు జిల్లా కార్యదర్శి కాడపాక శ్యామ్ మాదిగ పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుప్రీం కోర్టు చీఫ్ జస్టీస్ BR గవాయ్ పై జరిగిన దాడి భారత రాజ్యాంగం పై జరిగిన దాడిగా భావించాలని కోరారు. MRPS వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ పిలుపు మేరకు నవంబర్ 1 న తలపెట్టిన చలో హైదరాబాద్ దళితుల ఆత్మగౌరవ ర్యాలీ విజయవంతం చేయడానికి వెంకటాపూర్ మండలం MRPS MSP నాయకులు కార్యకర్తలు ప్రతి గ్రామం నుండి వాహనాలతో పెద్ద ఎత్తున జన సమీకరణ చేసుకొని తరలి రావాలని పిలుపు ఇచ్చారు.ఈ కార్యక్రమంలో మారేపల్లి రాజు మాదిగ చొప్పదండ్ల కిరణ్ మాదిగ చంటి సతీష్ మాదిగ మారేపెళ్లి మాస్ మాదిగ కుమార్ నరసయ్య రాజేష్ రమేష్ తదితరులు పాల్గొన్నారు.
……………………………………
