* రూ. 12 వేలు ఏమాయే
* కాంగ్రెస్ హయాంలో ఆటోడ్రైవర్ల పరిస్థితి అధ్వానం
* ఒక్కో కార్మికుడికి సర్కారు రూ.24 వేలు బాకీ
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : కాంగ్రెస్ ప్రభుత్వం హాయంలో రాష్ట్రంలోని ఆటోడ్రైవర్ల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని మాజీ మంత్రి హరీశ్‌రావు (Harish Rao) అన్నారు. ఆటోడ్రైవర్లకు అండగా ఆయన కోకాపేటలోని తన నివాసం నుంచి ఎర్రగడ్డకు, అక్కడి నుంచి తెలంగాణభవన్‌కు ఆటోలో ప్రయాణించారు. ఆటో కార్మికులకు బాకీ పడిన రూ.24 వేలు ఎంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ను ఓడిస్తేనే డ్రైవర్లకు ప్రభుత్వం ఇచ్చిన హామీ నెరవేరుతుందని సూచించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. పేరుకే ఉచిత బస్సు అని, మగవాళ్లకు డబుల్ టికెట్ కొట్టి కుటుంబాలపై భారం మోపుతున్నారని విమర్శించారు. రేవంత్ సర్కారు అధికారంలోకి వచ్చాక ఐదుసార్లు బస్ చార్జీలు పెంచిందని గుర్తు చేశారు. రాహుల్ గాంధీ (Rahulgandhi) ఎన్నికల ప్రచారంలో హైదరాబాద్(Hyderabad)కి వచ్చి సినిమా నటులకంటే ఎక్కువ నటించారని, చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీలో మెట్ల మీద కూర్చొని కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మొదటి ఏడాది 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని నిరుద్యోగులను మోసం చేశారని ఎద్దేవా చేశారు. నాడు రాహుల్ గాంధీ హైదరాబాద్ వచ్చి ఇదే యూసఫ్‌గూడా జూబ్లీహిల్స్‌లో ఆటో ఎక్కి ఆటో కార్మికులకు అరచేతిలో వైకుంఠం చూపించారన్నారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రూ.12 వేలు ఇస్తామని, ఆటోనగర్(Autonagar), ఆటో సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని ఎన్నో వాగ్దానాలు చేసి విస్మరించారని తెలిపారు. ఆటోనగర్ అసలే లేదు. ప్రమాద బీమా రూ.10 లక్షలకు పెంచుతామని పత్తా లేదన్నారు. రాష్ట్రంలో ఉన్న 5 నుంచి 6 లక్షల ఆటోలకు కాంగ్రెస్ పార్టీ ఒక్కొక్క ఆటోకు రూ.24 వేలు బాకీ పడింది. ఆ మొత్తాన్ని వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.
…………………………………………….
