* ప్రభుత్వ బెదిరింపులకు మేం భయపడేది లే
* నవంబర్ 3 నుంచి కాలేజీల నిరవధిక బంద్
* ఉన్నత విద్యా సంస్థల సమాఖ్య చైర్మన్ రమేష్‌బాబు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : నవంబర్ 3 నుంచి కాలేజీల నిరవధిక బంద్ పాటిస్తామని ఉన్నత విద్యా సంస్థల సమాఖ్య చైర్మన్ రమేష్‌బాబు వెల్లడించారు. నవంబర్ 1లోపు ప్రభుత్వం స్పందించి ఫీజు బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రోజుకో తరహాలో ఉద్యమం చేస్తామన్నారు. హైదరాబాద్‌లో అధ్యాపకులతో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. 10 లక్షల మంది విద్యార్థులతో నిరసన కార్యక్రమం చేపడతామన్నారు. బకాయిలు అడిగితే ప్రభుత్వానికి తనిఖీలు గుర్తుకు వస్తున్నాయని, ఆ బెదిరింపులకు తాము భయపడేది లేదని స్పష్టం చేశారు. దసరాకు ముందు కాలేజీల బంద్ ప్రకటనతో ప్రభుత్వం దిగివచ్చి 1200 కోట్ల రూపాయల బకాయిలను రెండు విడతల్లో చెల్లించేందుకు హామీ ఇచ్చింది. కానీ దసరా నాటికి 300 కోట్లు మాత్రమే చెల్లించి మిగతా వాటిని ఇప్పటివరకు ఇవ్వలేదని కాలేజీ యాజమాన్యాల ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. గత ప్రభుత్వంలో రెండేళ్లు, ఇప్పుడు రెండేళ్ల నుంచి ఫీజు రీయింబర్స్ మెంట్ ఇవ్వకున్నా కాలేజీలను నెట్టుకొచ్చామని ఇప్పుడు కాలేజీలు నడిపే పిరిస్థితి లేనందున సమ్మెకు దిగాలాని నిర్ణయించిన ఉన్నత విద్యాసంస్థల సమాఖ్య తెలిపింది.
………………………………………………………
