* అధికారులకు కలెక్టర్ దివాకర టి.ఎస్. ఆదేశం
ఆకేరు న్యూస్, ములుగు:ప్రజావాణి కార్యక్రమంలో అందిన దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. అన్నారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్,అదనపు కలెక్టర్లు సి హెచ్ మహేందర్ జి, సంపత్ రావు లతో కలిసి అర్జీదారుల నుండి దరఖాస్తులు స్వీకరించారు. ప్రజావాణి కార్యక్రమంలో 61 దరఖాస్తులు రాగా అత్యధికంగా భూ సమస్యలు 19, గృహ నిర్మాణ శాఖకు 10 పెన్షన్ 05, ఉపాధి కల్పనకు 04, ఇతర ఇతర శాఖలకు సంబంధించినవి 23 దరఖాస్తుల స్వీకరించగా వాటిని వెంటనే సంబంధిత అధికారులకు బదిలీ చేసి పరిష్కరించాలని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో ఆర్డీఓ వెంకటేష్, వివిధ జిల్లా స్థాయి అధికారులు, కలెక్టరేట్ పరిపాలన అధికారి, పర్యవేక్షకులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
……………………………………………………..
