* రాష్ట్రాన్ని పదేళ్లు దొంగలు పాలించారు
* వర్ధన్న పేట ఎమ్మెల్యే నాగరాజు ఫైర్
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : హరీష్ రావు తాడి చెట్టులా పెరిగాడు కానీ ఇంగితజ్ఞానం లేదని వర్దన్నపేట ఎమ్మెల్యే నాగరాజు ఫైర్ అయ్యారు. సోమవారం హైదరాబాద్ లోని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ నివాసంలో జరిగిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే నాగరాజు ,రాజ్యసభ ఎంపీ అనిల్ యాదవ్, మనుకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, తుంగతూర్తి ఎమ్మెల్యే మందుల సామ్యూలే, ఎంపీ అనిల్ యాదవ్, ఎమ్మెల్సీలు అద్దంకి దయాకర్, బల్మూరు వెంకట్ లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ హరీష్ రావు మంత్రి వర్గాన్ని దండుపాళ్యం ముఠాతో పోల్చడంపై మండి పడ్డారు. హరీష్ రావు ఇంగిత జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. మా నాన్న చుట్టూ దెయ్యాలు ఉన్నాయని కేసీఆర్ కూతురు కవిత అన్న మాటలను నాగరాజు గుర్తు చేశారు. బీఆర్ ఎస్ హయాంలో రాష్ట్రాన్ని ఏ విధంగా దోచుకుతిన్నారో ప్రజలందరికీ తెలుసు అన్నారు. 2014లో అధికారంలోకి రాక ముందు బీఆర్ ఎస్ ఇచ్చిన హామీలను ఎంత వరకు నెరవేర్చోరో తెలపాలని డిమాండ్ చేశారు. 10 ఏళ్లలో ఒక్క నిరుద్యోగికి కూడా ఉద్యోగం ఇవ్వలేదని ఆరోపించారు. రాష్ట్రాన్ని దోచుకొని అప్పుల పాలు చేశారని అన్నారు.
………………………………………….
