ఆకేరు న్యూస్ హైదరాబాద్ : మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు తండ్రి కు పితృ వియోగం తన్నీరు సత్యనారాయణ కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సత్యనారాయణ రావు ఈ రోజు తుదిశ్వాస విడిచారు. కోకా పేటలో ఉన్న హరీష్ రావు స్వగృహంలో క్రిన్స్ విల్లాస్ సత్యనారాయణ రావు పార్థివ దేహాన్ని ఉంచారు. అంత్యక్రియలు ఎప్పుడు నిర్వహిస్తారనేది తెలియరాలేదు
కేసీఆర్ సంతాపం
పార్టీ సీనియర్ నేత హరీశ్ రావు తండ్రి, తన్నీరు సత్యనారాయణ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం తెలిపారు. తన బావతో తనకున్న అనుబంధాన్ని స్మరించుకుని, ఆయన మృతి పట్ల విచారం వ్యక్తం చేశారు.సమాచారం తెలిసిన వెంటనే హరీశ్ రావును ఫోన్లో పరామర్శించారు. కుటుంబ సభ్యులను ఓదార్చారు. తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. మరికాసేపట్లో కోకాపేటలోని హరీశ్ రావు నివాసానికి వెళ్లి, దివంగత సత్యనారాయణ పార్థివ దేహానికి నివాళులు అర్పించి, తన సోదరిని, కుటుంబ సభ్యులను ఓదార్చనున్నారు.
సీఎం రేవంత్ రెడ్డి సంతాపం
మాజీ మంత్రి హరీష్ రావు తండ్రి సత్యనారాయణ రావు మృతి పట్ల సీఎం రేవంత్ రెడ్డి సంతాపవ వ్యక్తం చేశారు , హరీష్ రావుకు ఫోన్ చేసి తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. సత్యనారాయణ రావు ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు.
కవిత విచారం..
మాజీ మంత్రి సిద్దపేట ఎమ్మెల్యే హరీష్ రావు తండ్రి తన్నీరు సత్యనారాయణ రావు మృతి పట్ల తెలంగాణ జాగృతి అధ్యక్షరాలు కల్వకుంట్ల కవిత విచారం వ్యక్తం చేశారు.ఈ మేరకు ఆమె ఎక్స్ వేదికగా స్పందించారు. హరీష్ రావు తండ్రి సత్యనారానయణ రావు మృతిపై విచారం వ్యక్తం చేస్తున్నట్లు ట్వీట్ చేశారు. సత్యనారాయణ రావు ఆత్మకు శాంతి కలగాలంటూ ట్వీట్ చేశారు. హరీష్ రావు కుటంబసభ్యులకు కవిత తన సాను భూతి వ్యక్తం చేశారు.
………………………………………………………..
