* మొంథా తుఫాన్ ఎఫెక్ట్
ఆకేరు న్యూస్,డెస్క్ : మొంథా తుఫాన్ కారణంగా ఏపికి విమాన సర్వీసులు రద్దు అయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు పడుతున్న నేపధ్యంలో విమాన రాకపోకలకు వాతావరణం అనుకూలించక పోవడంతో ఎయిర్ వేస్ అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయం నుంచి విజయవాడ, విశాఖపట్నం,రాజమండ్రిలకు బయలుదేరాల్సిన 18 విమానాలను విమానాశ్రయ అధికారులు రద్దు చేశారు.భారీ వర్షాలు అతి భారీ వర్షాలతో ఏపీలో వాతావరణం భీతావహంగా ఉంది. పలు గ్రామాలు జలదిగ్భంధం కాగా రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అన్ని జిల్లాల్లో పునరావాస శిబిరాలను ఏర్పాటు చేశారు. అత్యవసర సేవలను అందుబాటులో ఉంచారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జిల్లా కలెక్టర్లతో వీడియో సమావేశాలు నిర్వహిస్తూ పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. ప్రజలకు అందుబాటులో ఉండాలని ఎన్డీఏ కూటమి నేతలను, కార్యకర్తలను ముఖ్యమంత్రి ఆదేశించారు.
………………………………………………
