* 18 ఏళ్లు నిండిన వారందరికీ ఇవ్వాల్సిందే
* ఉద్దండపూర్ నిర్వాసిత రైతులతో కవిత సమావేశం
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : ఉద్దండపూర్ నిర్వాసిత రైతులకు ఎకరాకు రూ. 25 లక్షలు ఇవ్వాలని జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు.2021 నాటికే కటాఫ్ పెట్టటం సరికాదని పరిహారం ఇచ్చే నాటికి 18 ఏళ్లు నిండిన వారందరికీ ఇవ్వాల్సిందేనని కవిత అన్నారు. మంగళవారం ఆమె
జనంబాట కార్యక్రమంలో భాగంగా పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టులో భాగమైన ఉద్దండాపూర్ రిజర్వాయర్ నిర్వాసితులతో మాట్లాడారు. వారి బాధలను అడిగి తెలుసుకున్నారు. తప్పు బీఆర్ ఎస్ చేసిందా కాంగ్రెస్ చేసిందా అనేది ముఖ్యం కాదని ప్రజలకు నష్టం జరుగకుండా చూడాలని కోరారు.
80 శాతం పనులు పూర్తయ్యాయని మిగిలిఉన్న పనులను కూడా త్వరితగతిన పూర్తిచేయాలని కోరారు.
తెలంగాణ రాకముందు మహబూబ్ నగర్ నగర్ లో నీళ్ల కరువు ఎలా ఉండేదో అందరికీ తెలిసిందే అన్నారు. వందల ఎకరాలు ఉన్నా నీటి సౌకర్యం లేక ప్రజలు వసలపోయారని గుర్తుచేశారు.
ప్రాజెక్ట్ కోసం భూములు ఇవ్వటానికి ఇక్కడి ప్రజలు పెద్ద మనసు చేసుకొని ఒప్పుకున్నందుకు రైతులకు కృతజ్ఞతలు.
………………………………………………
