ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు
* ఏపీ ప్రజలకు ముఖ్యమంత్రి చంద్రబాబు సూచన
* ఏపీలో ముంచుకొస్తున్న మొంథా తుఫాన్
ఆకేరు న్యూస్, డెస్క్ : ఏపీలో మొంథా తుఫాన్ నిమిష నిమిషానికి దగ్గరవుతోంది. ఈ నేపధ్యంలో ఏపీ ప్రభుత్వం అలర్ట్ అయింది, ముందస్తుగానే అన్ని చర్యలు తీసుకుంది, ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు, ముఖ్యంగా పేద ప్రజలకు ఇబ్బంది కలుగకుండా చూడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. మామూలు గృహాలు,గుడిసెల్లో నివసించే ప్రజలకు భవనాలు ఉన్న ప్రజలు తాత్కాలిక ఆశ్రయం ఇవ్వాలని సీఎం చంద్రబాబు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మానవతా దృక్ఫథంతో వ్యవహరించాలని ఏపీ ప్రజలకు సీఎం విజ్ఞప్తి చేశారు. ఏపీలో పోలీసులతో పాటు ప్రభుత్వ యంత్రాంగం, రెవెన్యూశాఖ అనుసంధానంగా పనిచేస్తున్నారు. అధికారులతో సీఎం చంద్రబాబు ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తూ ఆదేశాలు జారీ చేస్తున్నారు. తీవ్ర ప్రభావం ఉండే ప్రాంతాల్లో రిహాబిలిటేషన్ సెంటర్లను ఏర్పాటు చేశారు. పునరావాస కేంద్రాల్లో ఆహారం ,పాలు అన్నీ సిద్ధంగా ఉంచారు.సాయంత్రం ఐదు తరువాత ప్రజలెవరూ రోడ్లపైకి రాకూడదని హెచ్చరికలు జారీ చేశారు. తక్షణ సహాయక చర్యలకు ఎన్డీఆర్ఎఫ్ దళాలను సిద్ధంగా ఉంచారు.నర్సాపురం, రాజోలులో తుపాను తీరం తాకే అవకాశం ఉన్న నేపథ్యంలో సాయంత్రం 5 గంటల తర్వాత ప్రజలంతా ఇండ్లకు చేరుకోవాలని సూచించారు.విద్యుత్ స్తంభాలు, లైన్లు పునరుద్ధరించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
……………………………………………
