* జూబ్లీహిల్స్ లో కేటీఆర్
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సమీపిస్తున్నకొద్దీ ప్రధాన పార్టీల ప్రచారం ఊపందుకుంది. ముఖ్యంగా మూడు ప్రధాన పార్టీలు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ ఎస్ పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. కాంగ్రెస్ ముఖ్యనేతలందరూ ప్రచారంలో పాల్గొంటుండగా బీఆర్ ఎస్ పార్టీ ముఖ్యనేతలు కూడా నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఎలాగైనా జూబ్లీహిల్స్ సీటును నిలబెట్టుకోవాలని బీఆర్ ఎస్ పట్టుదలతో ఉంది. బీఆర్ ఎస్ తరపున స్టార్ కంపెయినర్లుగా హరీష్ రావు కేటీఆర్ విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. కాగా హరీష్ రావుకు పితృవియోగం జరిగిన సందర్భంగా హరీష్ రావు ప్రచారం పై సందిగ్థత నెలకొనగా కేటీఆర్ ప్రచారం షెడ్యూల్ మాత్రం ఖరారైంది.
కేటీఆర్ షెడ్యూల్ ఇదే..
ఈనెల 31 నుంచి నవంబర్ 9 వరకు నియోజకవర్గాన్ని మాజీ మంత్రి చుట్టేయనున్నారు. వరుసగా 10 రోజుల పాటు బైపోల్స్‌లో కేటీఆర్ రోడ్ షోలు, కార్నర్ మీటింగ్స్ నిర్వహించనున్నారు. అక్టోబర్ 31న షేక్‌పేట్,నవంబర్ 1న రెహమత్ నగర్,నవంబర్ 2న యూసుఫ్‌గూడ,నవంబర్ 3న బోరబండ,నవంబర్ 4న సోమాజిగూడ,నవంబర్ 5న వెంకట్రావు నగర్,నవంబర్ 6న ఎర్రగడ్డ డివిజన్,నవంబర్ 8న షేక్‌పేట్, యూసుఫ్‌గూడ, రెహమత్ నగర్ డివిజన్లలో రోడ్ షో నిర్వహించనున్నారు.ఇక చివరి రోజు నవంబర్ 9న షేక్‌పేట్ నుంచి బోరబండ వరకు నిర్వహించే బైక్ ర్యాలీతో కేటీఆర్ ప్రచారం ముగియనుంది.
…………………………………………………….
