* అధికారులకు సూచనలు
ఆకేరు న్యూస్ , వరంగల్ : హనుమకొండ నగరంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు నిట్ట మునిగిన ప్రాంతాలను వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ సందర్శించారు. ఈ సందర్భంగా పలు కాలనీలలో జల దిగ్భంధంలో ఉన్న ప్రజల వివరాలను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. అధికారులు ముంపు ప్రాంతాల పరిస్థితిని ఎప్పటికప్పుడూ పర్యవేక్షిస్తు ప్రజలకు కావాల్సిన సహాయం చేయాలని కోరారు. ప్రజలకు ఏ అవసరం వచ్చినా వెంటనే స్పందించాలని అన్నారు. ఎమర్జెన్సీ అవసరం ఉంటే తక్షణమే స్పందించాలన్నారు. ఎవరైనా అనారోగ్యంగా ఉంటే వారికి కావాలల్సిన వైద్య సహాయం అందించాలని సూచించారు. .
……………………………………….
