* బాధితులకు పాలపాకెట్లు, తాగునీరు పంపిణీ
ఆకేరు న్యూస్ హనుమకొండ : వరంగల్ ఎంపీ కడొయం కావ్య వరద ప్రాంతాల్లో పర్యటించారు.
అలంకార్ సర్కిల్, కాపువాడ, కాకతీయ కాలనీ వరద ప్రభావిత ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించి బాధితులకు పాలపాకెట్లు, తాగునీరు పంపిణీ చేశారు.ఎంపీతో పాటు ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి కూడా ఉన్నారు. ట్రాక్టర్ లో వెళ్లిన ఎంపీ నీటమునిగిన ప్రాంతాలను సందర్శించి, బాధితులతో మాట్లాడి వారికి ధైర్యం చెప్పారు.వర్షాల కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాలకు పాల ప్యాకెట్లు, త్రాగునీరు పంపిణీ చేస్తూ తక్షణ సహాయం అందించారు. ప్రజల సమస్యలను తెలుసుకుని, అవసరమైన సహాయక చర్యలు తీసుకునేలా అధికారులకు సూచించారు.ఈ కార్యక్రమంలో వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్, ఇతర అధికారులు స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
……………………………………..
