* అయోధ్య రామాలయం ఆదాయ, వ్యయాలను వెల్లడించిన కమిటీ
ఆకేరు న్యూస్, డెస్క్ : ఉత్తర ప్రదేశ్ అయోధ్యలో నెలకొని ఉన్న అయోధ్య రామమందిరం (Ayodhya Ram Temple) విశేషంగా ఖ్యాతి పొందుతోంది. రామ జన్మభూమిగా ప్రసిద్ది కాంచింది. 2020 ఆగష్టు 5న ప్రధాని నరేంద్ర మోదీ రామాలయ నిర్మాణానికి భూమి పూజ చేశారు. 2024 జనవరి 22న బాల రాముడు (రామ్ లల్లా) ప్రాణ ప్రతిష్ఠ జరిగింది. 51 అంగుళాల పొడవుతో 5 ఏళ్ల బాలుడిలా విల్లు, బాణం పట్టుకుని అయోధ్యలో రామ్ లల్లా భక్తులకు దర్శనమిస్తున్నాడు. తాజాగా అయోధ్య రామాలయం ఆదాయ, వ్యయాలను ట్రస్టు వెల్లడించింది. రామమందిరం నిర్మాణం కోసం ప్రజలు రూ.3,000 కోట్లకుపైగా విరాళాలు ఇచ్చారని నిర్మాణ కమిటీ చైర్మన్ నృపేంద్ర మిశ్రా తెలిపారు. ఆలయ ప్రాజెక్టు మొత్తం ఖర్చు దాదాపు రూ.1,800 కోట్లని.. ఇప్పటి వరకూ రూ.1,500 కోట్ల బిల్లులు చెల్లించామని వివరించారు. 2022లో నిర్మాణం కోసం విరాళాలు ప్రకటించినప్పటి నుంచి ఈ మొత్తం వచ్చినట్లు తెలిపారు. కాగా నవంబరు 25న ఆలయంలో ధ్వజారోహణ కార్యక్రమం నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ వేడుకలకు దాతలందరినీ ఆహ్వానిస్తామని ఆయన తెలిపారు. ఆరోజు ప్రధాని మోదీ (Modi) ముఖ్య అతిథిగా హాజరవుతారని, రామాలయంపై పతాకాన్ని ఆవిష్కరిస్తారని వివరించారు.
………………………………
