 
                * మూడంచెల భద్రతలో కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం
ఆకేరు న్యూస్ , హైదరాబాద్ : జూబ్లీహిల్స్ ఎన్నికలకు సంబంధించి యూసుఫ్‌గూడలో ఉన్న కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో డీఆర్సీ సెంటర్ తో పాటు స్ట్రాంగ్ రూం ను ఏర్పాటు చేశారు. కేంద్ర భద్రతా దళాలు పర్యవేక్షిస్తున్నాయి. మూడంచెల వ్యవస్థలో భాగంగా మొదటి అంచెలో.. ప్రధాన గేటు వద్ద ఒక ఏసీపీ, ముగ్గురు ఇన్స్పెక్టర్లు, ఐదుగురు ఎస్ఐలు, ఎనిమిది మంది ఏఎస్ఐలు, 33మంది కానిస్టేబుళ్లు, 8మంది ఉమెన్ కానిస్టేబుళ్లు, 3 ప్లాటూన్ల సాయుధ బలగాలతో భద్రత ఏర్పాటుచేయనున్నారు. రెండో అంచెలో.. స్టేడియం లోపలికి వెళ్లే గేటు వద్ద ఒక ఏసీపీ, ఇద్దరు ఇన్స్పెక్టర్లు, ఇద్దరు ఏఎ్‌సఐలు, 8 మంది కానిస్టేబుళ్లు, నలుగురు ఉమెన్ కానిస్టేబుళ్లు, రెండు చెకింగ్ టీమ్‌లు, రెండు అడ్యూడ్ ఫోర్సెస్ ప్లాటూన్లు బందోబస్తు నిర్వహించనున్నాయి.మూడో అంచెలో.. స్టేడియం లోపల ఈవీఎంల పంపిణీ, ఓట్ల లెక్కింపును చూసేలా ఒక ఏసీపీ, ఇద్దరు ఇన్స్పెక్టర్లు, ముగ్గురు ఎస్ఐలు, నలుగురు ఏఎ్సలు, 12మంది కానిస్టేబుళ్లు, ఐదుగురు మహిళా కానిస్టేబుళ్లు నిఘాలో ఉండనున్నారు.స్టేడియం చుట్టూ, పికెటింగ్‌ల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నారు.నవంబర్ 14 ఓట్ల లెక్కింపు వరకు ఇదే పరిస్థితి కొనసాగుతుంది.
………………………………………………………

 
                     
                     
                    