 
                * వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించనున్న సీఎం
ఆకేరు న్యూస్, హనుమకొండ : మొంథా తుఫాన్ తో తీవ్ర ప్రభావానికి గురైన ప్రాంతాల్లో 
సీఎం రేవంత్ రెడ్డి శుక్రవారం పర్యటించనున్నారు. శుక్రవారం మధ్యాహ్నం హైదరాబాద్ 
లోని గవర్నర్ నివాసం రాజ్ భవన్లో జరిగే మహ్మద్ అజారుద్దీన్ మంత్రిగా ప్రమాణ స్వీకారం 
చేసే కార్యక్రమంలో పాల్గొని అక్కడి నుంచి నేరుగా బేగంపేట విమానాశ్రయం చేరుకుంటారు. 
12 .45 గంటలకు బేగంపేట విమానాశ్రయంలో హెలీకాప్టర్ ఎక్కి నేరుగా హుస్నాబాద్, వరంగల్, 
హన్మకొండ ప్రాంతాల్లో వరద ముంపుకు గురైన ప్రాంతాలను ఏరియల్ సర్వే ద్వారా పరిశీలిస్తారు. 
1. 45 గంటలకు హన్మకొండ లోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల కు చేరుకుంటారు. మధ్యాహ్నం 
2 గంటలకు రోడ్డు మార్గం ద్వారా వరద ప్రాంతాలను సందర్శిస్తారు. నగరంలోని రంగం పేట,
సమ్మయ్య నగర్,పోతన నగర్ ప్రాంతాల్లో పర్యటిస్తారు. 3 గంటలకు కలెక్టరేట్ చేరుకొని
అధికారులతో వరదకు సంబంధించి సమీక్ష నిర్వహిస్తారు. నాలుగు గంటకు హెలీకాప్టర్లో 
హైదరాబాద్ కు బయలుదేరి వెళ్తారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా నగరంలో 
గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.
……………………………………………….

 
                     
                     
                    