* నాడు కేసీఆర్.. నేడు రేవంత్ రెడ్డి..
* ఎక్కడ వేసిన గొంగళి అక్కడే..
*అభివృద్ధి శూన్యం.. అంతా అస్తవ్యస్తం
* ఇరుకైన రోడ్లతో.. ప్రజల ఇబ్బందులు
* వరంగల్ నగరాన్ని ఎక్స్ రే తీసిన మొంథా తుఫాన్
ఆకేరు న్యూస్, వరంగల్ : సీఎం రేవంత్ రెడ్డి వరంగల్ పర్యటన సందర్భంగా ఈ సారైనా దశ తిరుగుతుందా అని నగర ప్రజలు ఎదురు చేస్తున్నారు. వరంగల్ ను రెండో రాజధానిగా అభివృద్ధి చేస్తామని గతంలో కేసీఆర్ హామీ ఇచ్చారు.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత సీఎం రేవంత్ రెడ్డి వరంగల్ నగరాన్ని రెండో రాజధానిగా తీర్చి దిద్దుతామని హామీ ఇచ్చారు. రెండో రాజధానిగా చెప్పుకునే వరంగల్ పరిస్థితి ఏంటో మొంథా తుఫాన్ తో బట్టబయలు అయింది. తుఫాన్ మొత్తం నగరాన్ని ఎక్స్ రే కాదు ఏకంగా ఎమ్మారై స్కానింగ్ తీసిందనే చెప్పుకోవాలి. ఒక్క రోజు భారీ వర్షానికే వరంగల్ నగరం అతలాకుతలం అయింది. రెండో రాజధానిగా చెప్పుకునే నగరంలో కనీస మౌలిక సదుపాయాలు లేని పరిస్థితి బట్టబయలు అయింది. భారీ వర్షాలకు కాలనీలకు కాలనీలు జలదిగ్బంధంతో సతమతమవుతున్నాయి. డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేక పోవడంతో మురుగు నీరు ఇళ్లుకు వచ్చి చేరుతోంది.వరంగల్- హనుమకొండ జంటనగరాల్లో శివనగర్, మైసయ్యనగర్, సమ్మయ్య నగర్, డీకేనగర్, ఎన్ఎన్ నగర్, సరస్వతికాలనీ, లక్ష్మీగణపతి కాలనీ, మధురానగర్ ప్రాంతాల పరిస్థితి కడు దమనీయంగా ఉంది. నగరంలో ముఖ్యంగా డ్రైనేజీ వ్యవస్థ లోపభూయిష్టంగా ఉంది. డ్రైనేజీ వ్యవస్థను మెరుగు పరిస్తే కాని కాలనీలు బాగుపడే పరిస్థితి లేదు. నగరంలో శాశ్వత ప్రాతిపదికన డ్రైనేజీవ్యవస్థను నిర్మించాల్సిన అవరం ఉంది. రోడ్డు రవాణా వ్యవస్థ కూడా అధ్వాన్నంగా ఉంది. ఇరుకైన రోడ్లతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ట్రాఫిక్ కు తగ్గట్టుగా రోడ్ల వ్యవస్థలేరు. ట్రాఫిక్ అంతరాయంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. యుద్ధ ప్రాతిపదికన రోడ్లను వెడల్పు చేసి భవిష్యత్ లో ఇబ్బంది
వరంగల్లో ప్రధాన సమస్యలు భారీ వర్షాలు మరియు వరదలు, దీనివల్ల అనేక కాలనీలు జలదిగ్బంధంలో చిక్కుకుంటున్నాయి. తాగునీటి సమస్య, ముఖ్యంగా రంగు మారిన నీరు సరఫరా కావడం, పారిశుద్ధ్యం లోపించడం మరియు డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండటం వంటి సమస్యలు కూడా ఉన్నాయి.
జంట నగరాలూ.. జల దిగ్బందం..
“మొంథా” తుఫాను ప్రభావంతో వరంగల్, హన్మకొండ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో జంట నగరాలూ జల దిగ్బందంలో మునిగిపోయాయి. అస్తవ్యస్తమైన డ్రైనేజీ వ్యవస్థ, ప్రణాళిక లేని పాలన, అక్రమ నిర్మాణాలు చేపట్టడం ఇందుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. అధికారుల ముందస్తూ ప్రణాళికలు లేకపోవడంతోనే భారీ వర్షాలకు పట్టణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నగరంలోని సగానికి పైగా కాలనీలు వరద నీటితో సహవాసం చేయక తప్పని పరిస్తితులు ఏర్పడుతున్నాయి.
అభివృద్ధిపై నీలి నీడలు.
నగరాన్ని అందంగా తీర్చిదిద్దుతామని నేతలు చెప్పే మాటల్లో నీలి నీడలు అలుముకుంటున్నాయి. హైదరాబాద్ నగరంతో సమానంగా, రాష్ట్రంలోనే రెండో అతిపెద్ద నగరంగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. రూ. 6500 కోట్ల నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. ఇందులో మౌలిక సదుపాయాల కల్పన ఔటర్ రింగ్ రోడ్డు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ రూ. 4170 కోట్లతో ఇతర అభివృద్ధి పనులకు కేటాయించినట్లు చెప్పినా..నగర అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగళీ అక్కడే అన్న చందంగా మారింది.
……………………………………………………
