 
                * పరీక్షల టైంటేబుల్ రిలీజ్ చేసిన బోర్డు
ఆకేరు న్యూస్,హైదరాబాద్ :ఇంటర్మీడియట్ పరీక్షల టైం టేబుల్ ను ఇంటర్మీడియట్ బోర్డు విడుదల చేసింది. 2026 ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18 వరకు ఇంటర్ మొదటి, రెండో సంవత్సర పరీక్షలు నిర్వహించ బడతాయని బోర్డు తెలిపింది.నవంబర్ 1 తేదీ నుంచి ఇంటర్ విద్యార్థుల నుంచి పరీక్ష ఫీజులు స్వీకరించనున్నట్లు పేర్కొంది, ఫిబ్రవరి 2 నుంచి 21 వరకు రోజుకు రెండు పర్యాయాలు అనగా ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహిస్తారు. అలాగే ఫిబ్రవరి 21న మొదటి సంవత్సరం 22 న రెండో సంవత్సరం కు ఇంగ్లీష్ ప్రాక్టికల్స్ ఉంటాయి.ఫిబ్రవరి25 నుంచి మొదటి సంవత్సరం, ఫిబ్రవరి 26 నుంచి రెండో 
సంవత్సరం థియరీ పరీక్షలు ప్రారంభం కానున్నాయి
ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షల టైంటేబుల్..
ఫిబ్రవరి 25 న పార్ట్ 1 సెకండ్ లాంగ్వేజ్,27 న పార్ట్ 2 ఇంగ్లిష్ పేపర్ 1,మార్చి 2 మ్యాథ్స్ 1 ,,ఏ,బొటనీ,పొలిటికల్ సైన్స్,మార్చి 5న మ్యాథ్స్,పేపర్ 1 బి,జువాలజీ, హిస్టరీ 1, మార్చి 9నఫిజిక్స్, ఎకనామిక్స్ 1, 3న కెమిస్ట్రీ, కామర్స్, 17న మోడ్రన్ లాంగ్వేజ్ పేపర్1, జియోగ్రఫీ 1
ఇంటర్ సెకండియర్ పరీక్షల టైం టేబుల్
ఫిబ్రవరి 26న పార్ట్ 2 సెకండ్ లాంగ్వేజ్2, 28న పార్ట్ 1 ఇంగ్లిష్ పేపర్ 2,, మార్చి 3న మ్యాథ్స్ 2ఎ,బొటనీ, పొలిటికల్ సైన్స్ 2, మార్చి 6న మ్యాథ్స్ పేపర్ 2బి, జువాలజీ, హిస్టరీ 2, మార్చి 10న ఫిజిక్స్, ఎకనామిక్స్ 2, మార్చి 13న కెమిస్ట్రీ, కామర్స్ 2, మార్చి 16న పిబ్లిక్ అడ్మినిస్ట్రేషన్,బ్రిడ్జి కోర్సు, మ్యాథ్స్ 2, మార్చి 18న మోడ్రన్ లాంగ్వేజెస్ పేపర్ 1,జియోగ్రఫీ 1 పేపర్లు ఉంటాయి.
………………………………………………..

 
                     
                     
                    