ఆకేరు న్యూస్, డెస్క్ : శ్రీకాకుళం కాశిబుగ్గ వేంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన తొక్కిసలాట ఘటనలో 10 మంది మృతి చెందగా పదుల సంఖ్యలో గాయపడిన విషయం తెల్సిందే.. కాశిబుగ్గ వేంకటేశ్వరస్వామి ఆలయం ప్రైవేట్ వ్యక్తుల నిర్వహణలోయ నడుస్తోంది. ఈ ఆలయాని ఉత్తరాంధ్ర చిన్నతిరుపతిగా భావిస్తారు.ఈ ఆలయం ఎప్పుడూ భక్తులతో కిటకిటలాడుతూ ఉంటుంది. ప్రతీ రోజై 15 వందల నుంచి 2 వేల మంది వరకు భక్తులు స్వామి వారిని దర్శనం చేసుకుంటారు. శనివారం ఏకాదశి కావడంతో భక్తులు వేల సంఖ్యలో తరలివచ్చారు. 2 వేల మంది భక్తులు సరిపడే చోట దాదాపు 25 వేల మంది భక్తులు లోపలికి ప్రవేశించారని తెలుస్తోంది. ఆలయం మొదటి అంతస్తులో ఉండడంతా పైకి ఎక్కుతున్న క్రమంలో రెయిలింగ్ ఊడి కిందపడింది. ఈ క్రమంలో ఏర్పడ్డ గందరగోళంలో భక్తులు అటూ ఇటూ పరుగులు తీయగా తొక్కిసలాట జరిగి పది మంది చనిపోగా పదుల సంఖ్యలో గాయ పడ్డారు చనిపోయిన వాళ్లలో మహిళలే అధిక సంఖ్యలో ఉన్నారు. మృతులు చిన్నమ్మి (50),విజయ (48) లీల (60) మశోధ (56), రాజేశ్వరి (60) రూప ,నిఖిల్ (13),బందావతి (52) అమ్మలు 9 (65)గా గుర్తించారు. గాయ పడ్డ వారిని పలాస ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
నిర్లక్ష్యమే కారణమా..?
వేంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన ఘటనకు నిర్వాహకుల నిర్లక్ష్యమే కారణమనే విమర్శలు వస్తున్నాయి. 2 వేల మంది భక్తులు పట్టే చోట 25 వేల మందికి అనుమతి ఇచ్చారు. పైగా రెయిలింగ్ సరిగా లేక పోవడంతో భక్తుల తాకిడికి రెయిలింగ్ కూలిపోయింది. ఏకాదశి కావడంతో భక్తులు అధిక సంఖ్యలో వస్తారని తెలిసినా నిర్వాహకులు మందస్తు చర్యలు తీసుకోలేదనే విమర్శలు వస్తున్నాయి. పైగా పోలీసుల సహాయం కూడా తీసుకోలేదని విన్పిస్తోంది.
ప్రధాని మోదీ దిగ్భ్రాంతి
వేంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిసలాట జరిగి 10 మంది మృతి చెందడంపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్భాంత్రి వెలిబుచ్చారు. మృతుల కుటుంబాలకు 2 లక్షల ఆర్థిక సాయం .గాయపడ్డ వారికి 50 వేల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించారు.
………………………………………………….
