*ఘటనా స్థలాన్ని పరిశీలించనున్న మంత్రి
ఆకేరు న్యూస్, డెస్క్ : శ్రీకాకుళం కాశిబుగ్గ ఆలయాని ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పయనమయ్యారు. శ్రీకాకుళం కాశిబగ్గ వేంకటేశ్వర స్వామి ఆలయంలో ఉదయం జరిగిన తొక్కిసలాటలోపది మంది మృతి చెందగా పదుల సంఖ్యలో గాయపడిన విషయం తెల్సిందే. ఈ నేపధ్యంలో మంత్రి నారా లోకేష్ తొక్కిసలాట జరిగిన ప్రాంతాన్ని పరిశీలించనున్నారు. ఈ ఘటనలో మృతుల కుటుంబ సభ్యులను, గాయపడిన వారిని పరామర్శించనున్నారు. శనివారం హైదరాబాద్ లో ఉన్న మంత్రి దుర్ఘటన గురించి తెలియగానే హుటాహుటిన బయలు దేరారు ముందుగా విశాఖ విమానాశ్రయం చేరుకొని అక్కడ నుంచి రోడ్డు మార్గంలో శ్రీకాకుళం వెళ్తారు.మరోవైపు కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు కూడా ఢిల్లీ నుంచి కాశీబుగ్గకు బయలుదేరారు. భోపాల్ పర్యటనను రద్దు చేసుకున్నారు. ఇప్పటికే గాయపడ్డ వారికి మెరుగైన చికిత్స అందించాలని ఆదేశాలు జారీ చేశారు. మృతుల కుటుంబాలకు కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
……………………………………………………..
