– బేస్ బాల్, ఫెన్సింగ్, యోగ ,రగ్బీ, పలు విభాగాల్లో ఎంపిక
ఆకేరు న్యూస్, కమలాపూర్: ఉమ్మడి వరంగల్ జిల్లాకేంద్రంలో నిర్వహించిన 69వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియ ఓసిటి క్రీడలలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన కమలాపూర్ తెలంగాణ మాడల్ స్కూల్ విద్యార్థులు రాష్ట్రస్థాయికి ఎంపికయ్యారు.యోగా విభాగంలో నక్క సమన్విత్, బేస్ బాల్ విభాగంలో 10వ తరగతి విద్యార్థి T. వినీల్ కుమార్, ఫెన్సింగ్, రగ్బీ క్రీడలో B. ప్రవళిక MPCI, పలు విభాగాలలో A. సృజన్ కుమార్ MPCI, I.నాగరాజు CECI,S. తేజస్విని BI.P.C, I.రుచిత్ర MPCI రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైనట్లు పాఠశాల ప్రిన్సిపల్ డాక్టర్ అనిత తెలిపారు. రాష్ట్రస్థాయికి ఎంపికైన విద్యార్థులను, ఫిజికల్ డైరెక్టర్ రాజును పాఠశాల ప్రిన్సిపల్ డాక్టర్ అనిత, ఉపాధ్యాయ బృందం అభినందించారు.రాష్ట్రస్థాయిలో కూడా అత్యుత్తమమైన ఫలితాలు సాధించాలని వారు ఆకాంక్షించారు.
……………………………………………
