* మణుగూరు ఘటనపై కేటీఆర్ ఫైర్
* బీఆర్ ఎస్ అండగా ఉంటుందని శ్రేణులకు భరోసా
* కాంగ్రెస్ పాలనకు త్వరలో చరమగీతం : కేటీఆర్
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : రాష్ట్రంలో గూండాయిజం, రౌడీయిజం పెరిగిపోయాయని మాజీ మంత్రి కేటీఆర్ (KTR) అన్నారు. రౌడీమూకల అరాచకాలకు భయపడాల్సిన అవసరం లేదని బీఆర్ ఎస్ శ్రేణులకు భరోసా ఇచ్చారు. మణుగూరు బీఆర్ ఎస్ శ్రేణులకు పార్టీ అండగా ఉంటుందన్నారు. త్వరలోనే మణుగూరును సందర్శిస్తా అని తెలిపారు. మణుగూరు పార్టీ ఆఫీసుపై దాడిని ఖండించారు. ఘటనపై రేగా కాంతారావుపై ఫోన్లో మాట్లాడారు. 60 లక్షల భారత రాష్ట్ర సమితి (BHARATHA RASTRA SAMITHI) కుటుంబమంతా మణుగూరు పార్టీ శ్రేణులకు తోడుగా ఉంటుందని, ధైర్యంగా ఉండాలని అన్నారు. త్వరలోనే మణుగూరును సందర్శిస్థానని కేటీఆర్ తెలిపారు. కాంగ్రెస్ పార్టీ రౌడీ మూకలకు, వారి అరాచకత్వానికి భయపడాల్సిన అవసరం లేదని కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రం నలుమూలలా, గ్రామస్థాయి నుంచి రాష్ట్ర రాజధాని దాకా ప్రతిచోటా రౌడీల రాజ్యం నడుస్తోందని, అరాచకత్వం కొనసాగుతోందని, దీనికి చరమగీతం పాడే రోజు దగ్గర్లో ఉందని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
…………………………………………..
