* ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ చూసేందుకు ప్రత్యేక ఏర్పాట్లు
*విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో భారీ ఎల్ ఈ డీ స్క్రీన్
* శాఫ్ ఆధ్వర్యంలో అన్ని జిల్లాల్లో …
ఆకేరు న్యూస్, డెస్క్ : మొన్నటి వరకు మొంథా తుఫాన్ తో తల్లడిల్లిన ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు క్రికెట్ ఫీవర్ అందుకుంది. మహిళల ప్రపంచ కప్ ను వీక్షించేందుకు క్రికెట్ అభిమానులు ఉవ్విళ్లూరుతున్నారు.
నవీ ముంబై లోని డీవై పాటిల్ స్టేడియంలో మధ్యాహ్నం మూడు గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఫైనల్ మ్యాచ్ లో దక్షిణాఫ్రికా సఫారీలతో ఇండియన్ గర్స్ తలపడుతున్నారు. ఈ మ్యాచ్ తిలకించేందుకు ఏపీలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. విజయవాడ లోని ఇందిరాగాంధీ స్టీడియంలో ఆంధ్రక్రికెట్ అసోసియేషన్ ఆధ్దర్యంలో భారీ ఎల్ ఈ డి స్క్రీన్ ను క్రికెట్ అభిమానుల కోసం ఏర్పాటు చేశారు,మరో వైపై శాప్ ఆధ్వర్యంలో అన్ని జిల్లాల్లోనూ ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు. అంతటా ఎల్ ఈ డీ స్క్రీన్లు ఏర్పాటు చేశారు. భారత్ జట్టు ఫైనల్ కు చేరడం ఇది మూడో సారి కాగా ఇంత వరకు కప్ ను గెలుచుకోలేదు. ఈ నేపధ్యంలో క్రికెట్ అభిమానులు ఇండియా కప్ గెలుచుకోవాలని కోరుకుంటున్నారు. ఫైనల్ మ్యాచ్ తిలకించేందుకు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.
…………………………………………
