ఆకేరు న్యూస్, చేవెళ్ల : చేవేళ్ల ఘోర రోడ్డు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఆర్టీసీ బస్సును కంకర లోడుతో వెళ్తున్న లారీ ఢీకొట్టింది. చేవెళ్ల మండలంలోని మీర్జాగూడ సమీపంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ప్రయాణికులపై కంకర పడిపోవడంతో మొత్తంగా 21 మంది మృతి చెందారు. పలువురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. ఇందులో 18 మంది ప్రయాణీకులు స్పట్లోనే ప్రాణాలు విడిచారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
ప్రమాదం నెలకొన్న తీరు..
ఆర్టీసీ బస్సు సోమవారం ఉదయం తాండూరు నుంచి హైదరాబాద్‌కు బయలుదేరింది. బస్సులో సుమారు 70 మంది ఉన్నారు. బస్సు ప్రయాణిస్తున్న సమయంలో అతివేగంగా కంకర లోడ్‌తో వస్తున్న టిప్పర్ ఢీకొట్టింది. దీంతో బస్సు లోపలికి టిప్పర్ దూసుకెళ్లింది. టిప్పర్‌లో ఉన్న కంకర.. బస్సులో పడటంతో ముందు వరుసలో ఉన్న ఆరు సీట్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. అక్కడిక్కడే 18 మంది మృతి చెందారు. రోడ్డు ప్రమాదంతో హైదరాబాద్, బీజాపూర్ హైవేపై ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. చేవెళ్ల, వికారాబాద్ మార్గంలో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ఇంకా సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి.
…………………………………………………..
