* మాజీ మంత్రి కేటీఆర్ కు మంత్రి పొంగులేటి సవాల్
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : పెద్దలకో న్యాయం.. పేదలకో న్యాయం పేరుతో హైడ్రా తీరుపై నిరసన వ్యక్తం చేస్తూ, తెలంగాణ భవన్లో మాజీ మంత్రి కేటీఆర్ నిన్న పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Minister Ponguleti Srinivasreddy) తన ఇల్లును ఎఫ్ టీఎల్ పరిధిలో నిర్మించినా హైడ్రా చర్యలు చేపట్టడం లేదని ఆరోపించారు. పేదల ఇళ్లను మాత్రం కూల్చేస్తున్నారని అన్నారు. కేటీఆర్ వ్యాఖ్యలపై మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తాజాగా స్పందించారు. తన ఇల్లు ఎఫ్టీఎల్ పరిధిలో ఉంటే తానే కూల్చేస్తానని, లేదంటే అప్పా జంక్షన్లో కేటీఆర్ (Ktr) ముక్కు నేలకు రాయాలని సవాల్ విసిరారు. ఏ వ్యాపారం చేసి ఇన్ని ఆస్తులు సంపాదించారని ఆయన కేటీఆర్‌ను ప్రశ్నించారు. లక్ష డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఎవరికిఇచ్చారన్నారు. బీఆర్ఎస్ కుట్ర, కుతంత్రాలను ప్రజలు గమనిస్తున్నారని వెల్లడించారు.
…………………………………………………..
