* జూబ్టీహిల్స్ ఎన్నికల ప్రచారంలో మంత్రి పొన్నం
* ఇంటింటికి తిరుగుతూ ప్రచారం
* నవీన్ యాదవ్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ కు మద్దతుగా యూసుఫ్ గూడ డివిజన్ లోని శ్రీకృష్ణ నగర్ లో డోర్ టూ ప్రచారం నిర్వహిస్తున్న మంత్రి పొన్నం ప్రభాకర్,ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, శివసేన రెడ్డి,ఆకుల లలిత , బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి, కర్ర రాజశేఖర్, ముఖ్య నేతలు ఇంటింటికి తిరుగుతూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ కు ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం దేశంలో ఎక్కడ లేని విధంగా ఒక్కొకరికి 6 కిలోల చొప్పున సన్న బియ్యం పంపిణీ చేస్తుందని ,200 యూనిట్ల ఉచిత విద్యుత్,500 కి గ్యాస్ సిలిండర్, మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాలు,మహిళలకు ఆర్టీసీ లో ఉచిత బస్సు ప్రయాణం, ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ ఓటర్లకు వివరించారు. అనంతరం కాపు సంఘ నాయకుల నివాసంలో అల్పాహార సమావేశాన్ని ఏర్పాటు చేశారు. నవీన్ యాదవ్ కు మద్దతుగా ఏకగ్రీవంగా మద్దతు ప్రకటించారు. స్థానికుడు విద్యావంతుడు నవీన్ యాదవ్ ను గెలిపించుకుంటే జూబ్లీహిల్స్ అభివృద్ధి జరుగుతుందన్నారు. కంటోన్మెంట్ ఎన్నికల్లో గెలిచిన మాదిరి జూబ్లీహిల్స్ లోనూ కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని చెప్పారు. బీసీ లకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని ఉద్దేశ్యంతో జూబ్లీహిల్స్ లో నవీన్ యాదవ్ కు టికెట్ కేటాయించామని తెలిపారు. ప్రతి ఒక్కరు ఓటరును నేరుగా కలిసి కాంగ్రెస్ పార్టీ కి ఓటు వేయాలని విజ్ఞప్తి చేయాలన్నారు. హైదరాబాద్ ఇంచార్జి మంత్రి గా ఉన్నా.. అభివృద్ధి బాధ్యత నాదే నని పొన్నం చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.
……………………………………………….
