ఆకేరు న్యూస్, కమలాపూర్ : సైబర్ నేరాలపై విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలని కమలాపూర్ పోలీస్ ఇన్స్పెక్టర్ హరికృష్ణ అన్నారు. కమలాపూర్ మండల కేంద్రంలోని తెలంగాణ మోడల్ స్కూల్ లో గురువారం సైబర్ క్రైమ్ ఫై అవగాహన సదస్సును పోలీసు ఇన్స్పెక్టర్ హరికృష్ణ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ… ఎలక్ట్రానిక్ పరికరాలతో ప్రజలను మోసం చేయడమే సైబర్ క్రైమ్ అని అన్నారు.ఫైనాన్షియల్ గా మోసాలు జరుగుతున్నాయని, అక్షరాస్యులు నిరక్షరాస్యులు అన్న తేడా లేకుండా అందరూ సైబర్ క్రైమ్ బాధితులు అవుతున్నారని, ఇటువంటి మోసాలను తగు జాగ్రత్తలు తీసుకునీ అధిగమించవచ్చునని సీ.ఐ విద్యార్థులకు తెలిపారు.డిజిటల్ అరెస్ట్ గురించి,OTP మోసాల గూర్చి , లోన్ ఆప్స్ గూర్చి, జాబ్స్ ఇప్పిస్తామని ఎలా మోసం చేస్తారో మొదలగు విషయాల గూర్చి విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఫోటో మార్ఫింగ్ చేసి ఎలా బ్లాక్ మెయిల్ చేస్తారో వివరించారు.డిజిటల్ అరెస్ట్ చేసామని ఎవరైనా బెదిరింపులకు పాల్పడితే వెంటనే పోలీస్ శాఖలను సంప్రదించాలని, ఎలాంటి ఆందోళనకు గురి కావద్దని తెలిపారు. కార్యక్రమంలో మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ డాక్టర్ అనిత, ఉపాధ్యాయులు విద్యార్థులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
…………………………………………………..
