* ఉప ఎన్నికల్లో రిగ్గింగ్ చేసేందుకే సీఎం ఫ్లాన్
* బీఆర్ ఎస్ నాయకులను టార్గెట్ చేసిన ప్రభుత్వం
* ఎం ఎల్ సీ తక్కళ్లపల్లి రవీందర్రావు కామెంట్
ఆకేరు న్యూస్, హైదరాబాద్ :
జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఓటమి భయం పట్టకుందని, అందుకే బీఆర్ ఎస్ నాయకుల ఇళ్లపై పోలీసులతో దాడులకు పాల్పడుతున్నారని ఎంఎల్ సీ తక్కళ్లపల్లి రవీందర్రావు కామెంట్స్ చేశారు. అనుమతి లేకుండానే పోలీసులు తమ ఇళ్లపై ఎలా తనిఖీలు చేస్తారని మండిపడ్డారు. ఈ సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడారు. అధికార పార్టీ నేతలు పోలీసులతో పైసలు పంచిస్తున్నారని ఆరోపించారు. ఉప ఎన్నికలో సీఎం, మంత్రులు పర్యటించడం వారిలో ఓటమి భయానికి నిదర్శమన్నారు. పోలీసుల యూనిఫాంను గౌరవించి మాట్లాడుతున్నానని చెప్పారు. మీడియాను అనుమతించకుండా పోలీసులు వీడియో తీయడమేంటని ప్రశ్నించారు. తెలంగాణ పోలీసుంటేనే నమ్మకం పోయిందని చెప్పారు. పదేండ్ల బీఆర్ఎస్ హయాంలో ఎన్నడూ ఇలాంటిది జరుగలేదన్నారు.
పోలీసులతో వాగ్వాదం..
అంతకుముందు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. కాంగ్రెస్ నాయకులే.. పోలీసులతో తమ ఇళ్లలో డబ్బులు పెట్టించి కేసులు పెట్టాలనే ప్రభుత్వం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు పోలీసులు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే సోదాలు చేయడం ఏంటని ఆగ్రహించారు. సీఎం రేవంత్ ఎలాగైనా గెలిచేందుకు పోలీసులతో రౌడీయిజం చేయిస్తున్నారని.. మండిపడ్డారు. తమ పదేండ్ల పాలనలో ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోలేదన్నారు.
