* గండి రామారం పంపు హౌస్ పరిశీలించిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్పూర్ : చిల్పూర్ మండలం, గండి రామారం పంపు హౌస్ పనులను తెలంగాణ మాజీ ఉపముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ శాసనసభ్యులు కడియం శ్రీహరి సందర్శించారు. ఎత్తిపోతల పనుల పురోగతిని సమీక్షించారు. అక్కడ పనిచేస్తున్న ఇంజనీర్లు, అధికారులతో మాట్లాడి ప్రాజెక్టు పనులు వేగవంతం చేయాలని సూచించారు. రైతుల సాగుకు నీటిని అందించేలా అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ.. ఎత్తిపోతల పథకం ద్వారా వేల ఎకరాల భూమికి నీటి సదుపాయం లభించబోతోందన్నారు. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ఈ ప్రాజెక్టును సమయానికి పూర్తి చేసి వ్యవసాయ రంగ అభివృద్ధికి మరింత కృషి చేస్తానని స్పష్టం చేశారు. ప్రాజెక్టు పూర్తయితే రైతులకు సాగు నీటి కష్టాలుండవని చెప్పారు.
