* మనస్తాపంతో బాలుడి ఆత్మహత్య
* మహబూబ్ నగర్ జిల్లాలో విషాదం
ఆకేరు న్యూస్, మహబూబ్ నగర్ : క్షణికావేశంలో ఏం చేస్తున్నారో తెలియడంలేదు. క్షణికావేశంలో నిండా నూరేళ్లు జీవించాల్సిన జీవితాలను మొదట్లోనే అంతం చేసుకుంటున్నారు. వాళ్లు చనిపోతూ కుటుంబసభ్యులకు జీవితాంతం తీరని క్షోభకు గురిచేస్తున్నారు. తెలిసీతెలియని వయస్సులో ఓ బాలుడు తన జీవితాన్ని అంతం చేసుకున్న సంఘటన మహబూబ్ నగర్ జిల్లా హన్వాడ మండలం సల్లోనిపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. విజయ్ (7వ తరగతి) కార్తీక పౌర్ణమి రోజున స్నేహితులతో కలిసి కురుమూర్తి జాతరకు వెళ్లాలనుకున్నాడు. ఇందు కోసం తండ్రి శ్రీనివాసులును రూ.100 అడిగాడు. కానీ పనులు ఉన్నాయని నిరాకరించడంతో విజయ్ మనస్థాపం చెందాడు. తల్లి ప్రభావతి సర్దిచెప్పి డబ్బులు ఇప్పించినా.. అప్పటికే స్నేహితులు వెళ్లిపోయారు. దీంతో విజయ్ బాధతో పొలానికి వెళ్లి, అక్కడే చెట్టుకు ఉరి వేసుకొని చనిపోయాడు.
……………………………………………
