* జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్.
ఆకేరు న్యూస్, ములుగు: రైతులకు ఇబ్బందులు కలగకుండా పత్తి కొనుగోలు జరగాలని జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. అన్నారు. సోమవారం ములుగు మార్కెట్ కమిటీ పరిధిలోని శ్రీ సాయి లక్ష్మీ నరసింహ కాటన్ జిన్నింగ్ మిల్, అన్నంపల్లి CCI పత్తి కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్ (రెవిన్యూ) సి హెచ్ మహేందర్ జి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవి చందర్, మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కళ్యాణి లతో కలసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత జిల్లా యంత్రాంగం పైన ఉందన్నారు.
జిన్నింగ్ మిల్లుల యజమానులు కొనుగోలు ప్రక్రియను సజావుగా నిర్వహించాలని సూచించారు. ప్రస్తుత పత్తి కొనుగోలు సీజన్ కు సంబంధించిన ఏర్పాట్లు, రైతులకు సరైన ధర (MSP) చెల్లింపు, కొనుగోలు కేంద్రాల లో సౌకర్యాల ఏర్పాటు, తూకం చెల్లింపు ప్రక్రియల పారదర్శకంగా నిర్వహించాలని అన్నారు. రైతులకు అన్ని సదుపాయాలు కల్పించాలని , పత్తి కొనుగోళ్లు సీసీఐ ద్వారా మద్దతు ధరలకు పత్తి కొనుగోళ్లు సజావుగా జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. కొనుగోలు కేంద్రాలలో కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయడానికి సీసీఐ అధికారులు, జిన్నింగ్ మిల్లుల యజమానులు, సంబంధిత అధికారుల మధ్య సమన్వయం చేసుకుంటూ సమస్యల పరిష్కారం సాంకేతిక లోపాలు, సమస్యలు వంటివి పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సీసీఐ అధికారులు మిల్లుల యజమానులు రైతులకు తగిన మద్దతు ధర చెల్లించడం, తేమ శాతం (Moisture Content) పరిశీలనలో నిబంధనలు పాటించడం, బరువు తూకం పట్ల సక్రమంగా వ్యవహరించాలని సూచించారు. రైతులు కిసాన్ కపాస్ ద్వారా స్లాట్ బుకింగ్ బుక్ చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా మార్కెటింగ్ అధికారి సోనియా, ప్రజా ప్రతినిధులు, మిల్ అసోసియేషన్ సభ్యులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.
……………………………………………………………………
