ఆకేరు న్యూస్, ములుగు: మేడారం సమ్మక్క సారలమ్మ మహా జాతరను పురస్కరించుకొని మాస్టర్ ప్లాన్ తో గద్దెల పరిసరాలలో జరుగుతున్న అభివృద్ధి పనులను బుధవారం రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ (సీతక్క)బుధవారం మేడారం రానున్నారు. జాతరకు వచ్చే భక్తులు అమ్మవార్ల గద్దెలను సునాయాసంగా దర్శించుకుని కానుకలు మొక్కులు సమర్పించే క్రమంలో ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా ఉండేందుకు ముందస్తు జాగ్రత్త చర్యలలో భాగంగా గద్దెల ఆవరణలో ప్రత్యేకమైన ఏర్పాట్లు చేపట్టారు. దీంతోపాటు ఆదివాసి ఆచార సంప్రదాయాలకు అనుగుణంగా గద్దెల ఆవరణలో గ్రానైట్ శిలలతో సుమారు వెయ్యేళ్ల పాటు ఉండే విధంగా ఆదివాసి ఆచారాలు భవిష్యత్ తరాలకు అందించే విధంగా మాస్టర్ ప్లాన్ తో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. గోవిందరాజు,పగిడిద్దరాజుల గద్దెల పునః ప్రతిష్ట కార్యక్రమం వీటన్నింటి పై మంత్రులు చర్చించి పనులను పరిశీలించి సంబంధిత శాఖ అధికారులకు కాంట్రాక్టర్లకు మంత్రి దిశా నిర్దేశం చేయనున్నారు.
…………………………………………………….
