* ఈసీని కోరిన తమిళ వెట్రి కజగం
ఆకేరు న్యూస్, డెస్క్ : తమిళ వెట్రి కజగం పేరుతో పార్టీని స్థాపించి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన హీరో విజయ్ పార్టీకి చిహ్నం కేటాయించాలంటూ ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేశారు. ఫిబ్రవరి 7న టీవీకేను ప్రాంతీయ పార్టీగా కేంద్ర ఎన్నికల సంఘంలోరిజిస్టర్ చేయించిన విషయం తెల్సిందే.. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా పలు సభల్లో విజయ్ పాల్గొంటూ ఇప్పటి నుంచే ప్రచారానికి స్వీకారం చుట్టారు. ఈ నేపధ్యంలో మంగళవారం ఢిల్లీలోని కేంద్ర ఎన్నికల కమిషన్ కార్యాలయంలో టీవీకే సంయుక్త ప్రధాన కార్యదర్శి నిర్మల్ కుమార్, సీనియర్ నాయకుడు అర్జున మూర్తి తదితరులు కేంద్ర ఎన్నికల కమిషనర్ రాజీవ్‌కుమార్, ఇతర కమిషనర్లను కలిసి ఎన్నికల చిహ్నం కేటాయించాలంటూ దరఖాస్తు అందించారు. ఓడ, విజిల్, ఆటో, క్రికెట్ బ్యాట్ తో పాటు పది ఛిహ్నాలను ఎన్నికల సంఘానికి అందజేశారు.ఎన్నికల కమిషన్ నిబంధన ప్రకారం, కొత్త పార్టీలు మొదటిసారి ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఎన్నికల చిహ్నాన్ని పొందేందుకు ముందుగా దరఖాస్తు చేసుకోవాలి.ఆ మేరకు టీవీకే తరఫున ఆ పార్టీ నేతలు చిహ్నం కోసం దరఖాస్తు సమర్పించారు. టీవీకే పార్టీకి ఏ గుర్తు కేటాయించాలనే నిర్ణయం కేంద్ర ఎన్నికల సంఘం తీసుకుంటుంది. కేంద్ర ఎన్నికల సంఘం కేటాయించిన చిహ్నంపై టీవేకే ఎన్నికల్లో పోటీ చేస్తుంది.
……………………………………………
