* సహజమే అంటున్న ప్రిన్సిపాల్?
ఆకేరు న్యూస్, నల్లగొండ : నల్గొండ మెడికల్ కాలేజీలో మరోసారి ర్యాగింగ్ కలకలం రేగింది. ర్యాగింగ్ కు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ త్రిపాఠి హెచ్చరించిన కొన్నిరోజులకే ఈ ఘటన జరగడం చర్చనీయాంశంగా మారింది. బాధిత విద్యార్థులు ర్యాగింగ్ అంశాన్ని కాలేజీ ప్రిన్సిపాల్‌కు ఇది సహజమే అని, రేపు సీనియర్లు అయ్యాక మీరూ చేస్తారని పేర్కొన్నట్లు తెలిసింది. అయితే ఫిర్యాదు చేయడంపై సీనియర్లు మరోసారి వారిని ఇబ్బందులకు గురి చేసినట్లు బాధితులు వాపోతున్నారు. నల్లగొండ మెడికల్ కళాశాల(Nallagonda Medical College)లో ర్యాగింగ్ కలకలం దావానలంలా వ్యాపించడంతో అదనపు కలెక్టర్ నారాయణ అమిత్, ఆర్డీవో అశోక్‌రెడ్డితో కలిసి కళాశాలను సందర్శించారు. కళాశాల ప్రిన్సిపాల్ సత్యనారాయణ, హెచ్వోడీలు, అధ్యాపక బృందం, విద్యార్థి సంఘాల నాయకులు, మెంటర్లు, సీనియర్, జూనియర్ విద్యార్థులతో కలెక్టర్ విడివిడిగా చర్చించారు. కళాశాలల్లో ర్యాగింగ్ జరగకుండా వైద్య కళాశాలకు మెంటర్లను, ర్యాగింగ్ నిరోధక కమిటీలను ఏర్పాటు చేశామన్నారు. ఎవరైనా ర్యాగింగ్(Raging) కు పాల్పడినా, రూల్స్‌కు వ్యతిరేకంగా ప్రవర్తించినా వారిపై కఠిన చర్యలు తప్పవన్నారు. ఎలాంటి రికమండేషన్లు పని చేయవని ముందే పేర్కొన్నారు.
………………………………………………..
