* త్వరలో ఏపీకి భారీ గుడ్ న్యూస్ : మంత్రి లోకేశ్
ఆకేరు న్యూస్, న్యూఢిల్లీ : నమో అంటే నాయుడు(Naidu).. మోదీ (Modi) అని అర్థం అంటూ ఏపీ మంత్రి, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి తనయుడు నారా లోకేష్ వ్యాఖ్యానించారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. పరిశ్రమలు ఏపీ(AP)ని ఎంచుకోవడానికి మూడు కీలక కారణాలు ఉన్నాయని వివరించారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ.. మంచి సంబంధాలు నెలకొల్పుతున్నందునే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పరిశ్రమలు వస్తున్నాయని, పెట్టుబడులకు వేగవంతమైన సౌకర్యాల కల్పన కీలకమన్నారు. టీసీఎస్, కాగ్నిజెంట్ వంటి కంపెనీలు ఏపీని ఎంచుకున్నాయని చెప్పారు. ‘విశాఖలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు జరుగుతోంది. ఏపీకి ఈ అవకాశమిచ్చిన సీఐఐకి ధన్యవాదాలు. 120 బిలియన్ డాలర్ల పెట్టుబడులు వస్తాయని ఆశిస్తున్నాం’ అని అన్నారు. అంతేకాకుండా ఏపీకి మరో గుడ్ న్యూస్ అంటూ.. సోషల్ మీడియా ఎక్స్ లో ట్వీట్ చేశారు. త్వరలో ఏపీకి భారీ గుడ్ న్యూస్, అందరితోనూ పంచుకుంటానని మెసేజ్ చేశారు.
…………………………………………………
