* చూపు కోల్పోయిన మూడేళ్ల రిత్విక్
ఆకేరు న్యూస్, రంగారెడ్డి : వీధి కుక్కల దాడిలో రిత్విక్ (3) చూపు కోల్పోయాడు. రంగారెడ్డి జిల్లా ఫరూఖ్‌నగర్ మండలం నాగులపల్లి గ్రామంలో పాఠశాల నుండి వస్తున్న జ్యోతి, జనార్దన్ దంపతుల కొడుకు రిత్విక్(3) బాలుడిపై వీధి కుక్కలు దాడి చేశాయి. ఈ దాడిలో రిత్విక్ ఎడమ కన్ను తీవ్రంగా గాయపడగా, చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని సరోజినీదేవి కంటి ఆసుపత్రికి తరలించారు. బాలుడి కన్ను పరీక్షించి కంటి చూపు పోయినట్టు నిర్ధారించడంతో.. తల్లీదండ్రులు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. రిత్విక్‌పై దాడి చేసిన రోజే వీధి కుక్కలు మరో చిన్నారిపైన చేశాయని గ్రామస్థులు తెలిపారు. అధికారులు స్పందించి చర్యలు చేప్టటాలని కోరారు.
