* శంకుస్థాపనలు చేసిన మంత్రి సీతక్క
ఆకేరు న్యూస్, ములుగు: ములుగు జిల్లా కేంద్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ (సీతక్క) గురు వారం శంకుస్థాపనలు చేశారు. ఇందులో భాగంగా జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో 50 లక్షల నిధుల తో సైన్స్ ల్యాబ్ & కంప్యూటర్ ల్యాబ్ నిర్మాణము పనులకు,15 లక్షల నిధులతో తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ భవనం, 10 లక్షల నిధులతో నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ భవనం నిర్మాణ పనులకుగట్టమ్మ వద్ద 3 కోట్ల 62 లక్షల నిధులతో
33/11 కెవి విద్యుత్ ఉప కేంద్రం నిర్మణ పనులకు 61 లక్షల నిధులతో చేపట్టిన బండారుపల్లి జంక్షన్ అభివృద్ధి, సుందరీకరణ పనులు రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క, జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్.,ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పైడాకుల అశోక్ గారు,గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవి చందర్ గారు, మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కళ్యాణి గారు,ఆత్మ కమిటీ చైర్మన్ రవీందర్ రెడ్డిలతో వివిధ శాఖల అధికారులు స్థానిక ప్రజా ప్రతినిధులు కలిసి ప్రారంభించారు.
