* రాష్ట్రంలో ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు
* 2047 నాటికి 3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా లక్ష్యం
* గ్లోబల్ కంపెనీలకు ప్రధాన కేంద్రంగా హైదరాబాద్
* యూఎస్, ఇండియా భాగస్వామ్య సదస్సులో సీఎం రేవంత్
ఆకేరు న్యూస్, డెస్క్ : తెలంగాణాలో ప్రపపంచ స్థాయి మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ తెలిపారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా యూఎస్, ఇండియా భాగస్వామ్య సదస్సులో సీఎం పాల్గొని మాట్లాడారు. భారతదేశంలోనే యువ, ఉత్సాహవంతమైన, విజయవంతమైన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నానని చెప్పారు. ఇండియా మార్కెట్కు తెలంగాణా గేట్ వే అన్నారు. దీంతో హైదరాబాద్ గ్లోబల్ కంపెనీలకు ప్రధాన కేంద్రంగా ఎదిగిందన్నారు. తెలంగాణను 2034 నాటికి 1 ట్రిలియన్ డాలర్లు, 2047 నాటికి 3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మార్చేందుకు పెట్టకున్న లక్ష్యానికి భారీ స్పందన వచ్చిందన్నారు.
కార్పొరేట్ పేర్లతో హైదరాబాద్ రోడ్లు..
హైదరాబాద్లోని రోడ్లకు ఇక నుండి కార్పొరేట్ కంపెనీల పేర్లు పెట్టనున్నట్లు సీఎం రేవంత్ తెలిపారు. ఇంతకు ముందు రాజకీయ నాయకుల పేర్లతో ఉన్నాయని.. ఇక నుంచి గూగుల్, మెటా టీసీఎస్, ఇన్ఫోసిస్ రోడ్లను తెలంగాణ ప్రజలు చూడబోతున్నారని చెప్పారు. 30 వేల ఎకరాల్లో భారత్ ఫ్యూచర్ సిటీ దేశంలోనే అత్యధునికంగా రూపుదిద్దుకుంటుందని పేర్కొన్నారు.
డిసెంబర్లో 8, 9 తేదీల్లో తెలంగాణాలో నిర్వహించనున్న తెలంగాణ రైజింగ్కు యూఎస్ ఐ ఎస్పీఎఫ్ మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు.
