* ఎన్నో ఏళ్లు గా విద్యాహక్కులపై పోరాడుతున్నాం
* నిజా నిజాలు నిగ్గుదేల్చండి
* ప్రైవేట్ స్కూల్ దాడి ఘటనపై పీడీఎస్యూ డిమాండ్
ఆకేరు న్యూస్, హనుమకొండ : హన్మకొండ లోDIGI SCHOOL లో జరిగిన సంఘటన పై పీడీఎస్యూ వివరణ ఇచ్చారు. ఈ మేరకు పత్రికా ప్రకటన విడుదల చేశారు.వరంగల్ జిల్లా కేంద్రంలో డిసెంబర్ నెలలో PDSU రాష్ట్ర 23వ మహాసభలను నిర్వహించబోతున్నసంగతి మీ అందరికీ తెలిసినదేనని పేర్కొన్నారు. మహాసభల నిర్వహణ ఖర్చుల నిమిత్తం విద్యార్థి సంఘాలకు వివిధ విద్యాస 1యాజమాన్యాలు అందించే సహకారాలు కూడా మీకు తెలియనిది కాదని పేర్కొన్నారు. దీనిలో భాగంగా రాష్ట్ర సభలు వరంగలనిర్వహిస్తున్నందున అన్ని విద్యా సంస్థల మాదిరిగానే రాష్ట్ర మహాసభల సహకారం కోసం హన్మకొండ లోDIGI SCHOOL చైర్మెన్ వర్మ గారితో కలిసి మాట్లాడేందుకు వెళ్లిన PDSU వరంగల్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుమహేష్, అజయ్ పట్ల స్మైలి డీజీ స్కూల్ మేనేజ్మెంట్ దురుసుగా ప్రవర్తించారని ప్రకటనలో పేర్కొన్నారు. అంతటితో ఆగకుండా స్కూల్ చైర్మెన్ వర్మగారు PDSU జిల్లా ప్రధాన కార్యదర్శి మహేష్ మాట్లాడుతుండగానే అతడిని అసభ్య పదజాలంతో తిట్టారని ఆరోపించారు. గౌరవ స్థానంలో ఉన్న స్కూల్ చైర్మెన్ వర్మ వ్యవహరించిన తీరు సరైనదేనా అనిఒకసారి ఆలోచించాల్సిందిగా కోరుతున్నామని అన్నారు. అదే విధంగా CC TV వీడియోలో ఎవరు ఏం మాట్లాడారో ఒకసారి పూర్తిగావినవల్సిందిగా కోరుతున్నాము. అలాగే గొడవ ఎందుకు జరిగిందో, గొడవ జరగడానికి దారి తీసిన కారణాలు ఏంటోగమనించవల్సిందిగా ప్రజలు, ప్రజాస్వామికవాదులు, విద్యాసంస్థల యాజమాన్యాలను PDSU తెలంగాణ రాష్ట్ర కార్యవర్గంతరపున కోరారు
