* కొండాపై కేస్ విత్ డ్రా చేసుకున్న నాగార్జున
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : మంత్రి కొండా సురేఖ పై వేసిన పరువు నష్టం కేసును సినీ హీరో నాగార్జున విత్ డ్రా చేసుకున్నారు. నాగార్జున వేసిన పిటిషన్ ఈ రోజు నాంపల్లి కోర్టులో విచారణకు వచ్చింది, ఈ సందర్భంగా తాను కేసును ఉపసంహరించుకుంటున్నట్లు నాగార్జున ప్రకటించారు. గతంలో కొండా సురేఖ తమ కుటుంబ సభ్యులను ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యలు తమ పరువుకు భంగం కలిగించాయని న్యాయ స్థానంలో కేసు నమోదు చేశారు. అప్పట్లో ఈ అంశం పెద్ద ఎత్తను చర్చనీయాంశమైంది . ఎట్టకేలకు మంత్రి కొండా సురేఖ క్షమాపణ చెప్పడంతో కేసు సుఖాంతమైంది.
