* కాంగ్రెస్, బీఆర్ ఎస్ హోరాహోరీ
* 5085 ఓట్ల మెజార్టీతో నవీన్ యాదవ్
* ప్రభావం చూపని బీజేపీ
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : జూబ్లీహిల్స్ ఓట్ల లెక్కింపు ఉత్కంఠ రేపుతోంది. ప్రధానంగా అధికార పార్టీ కాంగ్రెస్, ప్రతిపక్ష పార్టీ బీఆర్ ఎస్ మధ్య హోరా హోరీ కొనసాగుతోంది. బీజేపీ కనీస ప్రభావం చూపడం లేదు. తొలి రౌండ్ పూర్తయ్యేసరికి కాంగ్రెస్ కేవలం 62 ఓట్ల ఆధిక్యంలోనే ఉంది. మొదటి రౌండ్లో షేక్‌పేట డివిజన్లోని పోలింగ్ బూత్ ఓట్లను లెక్కించగా.. కాంగ్రెస్ పార్టీ 8,926 ఓట్లు వచ్చాయి. ఇక బీఆర్ఎస్కు 8,864 ఓట్లు వచ్చాయి. ఇక పోస్టల్ బ్యాలెట్ల విషయానికొస్తే కాంగ్రెస్‌కు 47 ఓట్లు వచ్చాయి. బీఆర్ఎస్కు 43 ఓట్లు రాగా.. బీజేపీకి కేవలం 11 ఓట్లు మాత్రమే వచ్చాయి. అధికారికంగా ఇప్పటి వరకు మూడు రౌండ్ల లెక్కింపు పూర్తి కాగా 5085 ఓట్ల మెజార్టీతో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ దూసుకుపోతున్నారు. రెండో రౌండో్ల 2217.. మూడో రౌండులో 2800 ఆధిక్యంతో ముందున్నారు. మొత్తంగా మూడు రౌండ్లలో నవీన్ యాదవ్ 5085 ఆధిక్యంతో లీడులో కొనసాగుతున్నారు.
…………………………………………
