ఆకేరు న్యూస్, ములుగు: ములుగు జిల్లా కేంద్రంలో 58 వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు శుక్రవారం జిల్లా గ్రంథాలయ కేంద్రంలో జిల్లా అడిషనల్ కలెక్టర్ (లోకల్ బాడీ )సంపత్ రావు ,జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ భానోత్ రవిచందర్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కల్యాణి , డీఈవో సిద్దార్థ రెడ్డి, PACS చైర్మన్ బొక్క సత్తి రెడ్డి,ఆత్మ కమిటీ చైర్మన్ కొండం రవీందర్ రెడ్డిలు పాల్గొని వారోత్సవాలు ప్రారంబించారు. నవంబర్ 14 నుండి నవంబర్ 20 జరిగే గ్రంథాలయ వారోత్సవాల్లో రోజు వారి కార్యక్రమాలు వివరించారు. జిల్లా గ్రంథాలయ కేంద్రంలో చదువుకునే వారు మంచి ఉద్యోగాలు సాధించి జిల్లాకి మంచి పేరు తీసుకురావాలని రవిచందర్ సూచించారు.ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సిబ్బంది, కాంగ్రెస్ పార్టీ నాయకులు,పాఠకులు తదితరులు పాల్గొన్నారు.
……………………………………………………..
