*భారత కమ్యూనిస్టు పార్టీ ములుగు జిల్లా కార్యవర్గ సభ్యులు ఎం డి అంజాద్ పాషా
ఆకేరు న్యూస్, ములుగు: ములుగు మండల పరిధిలోని పోట్లాపూర్ గ్రామంలోని ఆదివాసి గిరిజన కుటుంబమైన ఈక రమేష్ గృహం కరెంటు సర్క్యూట్ కారణంగా గురు వారం సాయంత్రం ఇల్లు కాలిపోయింది . దీంతో ఇంటిలో వంట సామాగ్రి ,రెండు క్వింటాల బియ్యం, 20వేల నగదు ,సైకిల్, రెండు ఫ్యాన్లు, బట్టలు , నిత్యావసర సరుకులు ఇతర సామాగ్రి ఖాళీ బూడిద అయ్యాయి.ఈ కుటుంబాన్ని భారత కమ్యూనిస్టు పార్టీ ములుగు జిల్లా కార్యవర్గ సభ్యులు ఎం డి అంజాద్ పాషా పరమార్శించి మాట్లాడుతూ… కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇల్లు కాలిపోయిన ఈక రమేష్ కుటుంబానికి డబుల్ బెడ్ రూమ్ మంజూరు చేయాలని, తక్షణం 50 వేల నష్టపరిహారం అందించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. పరామర్శించిన బృందం కార్యక్రమంలో భారత కమ్యూనిస్టు పార్టీ నాయకులు. ఈసం మహేందర్ పెండకట్ల సమ్మయ్య ,పెండకట్ల తిరుపతి, ఎట్టి శ్రావణ్, సారయ్య, లావుడియా ధన్సింగ్, సమ్మక్క, రవి తదితరులు పాల్గొన్నారు.
బియ్యం,వంట పాత్రలు పంపిణీ
పొట్లపూర్ గ్రామంలో ఇల్లు పూర్తిగా దగ్ధమైన కుటుంబానికి ములుగు లయన్స్ క్లబ్ , రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో 25 కేజీ ల రైస్, మూడు చందర్‌లు, రెండు టవల్స్ వంట పాత్రల కిట్,ఒక తార్పాలిన్ కవర్ అందజేశారు .ఈ కార్యక్రమంలో ములుగు ఎస్సై వెంకటేశ్వరరావు,రెడ్ క్రాస్ సభ్యులు చుంచు రమేష్,గంగిసేట్టి, శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.

……………………………………………..
