* మంత్రివర్గంలో చర్చించి త్వరలో నిర్ణయం
* 50 శాతం లోపు రిజర్వేషన్లతోనే ఎన్నికలు..?
ఆకేరు న్యూస్, డెస్క్ : కాంగ్రెస్కు జూబ్లీహిల్స్ ఎన్నిక ఊపునిచ్చింది. ఇదే జోష్తో స్థానిక ఎన్నికలకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ అఖండ విజయం సాధించారు. దీంతో కాంగ్రెస్ రికార్డును సొంతం చేసుకుంది. ఇదే తరుణంలో స్థానిక ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు సమాచారం. స్థానిక ఎన్నికలకు ఇదివరకే షెడ్యూల్ ప్రకటించిన విషయం తెలిసిందే. బీసీలకు 42 శాతం కోటాతో ఎన్నికలు వాయిదా పడ్డాయి. దీంతో న్యాయపరమైన చిక్కులు రాకుండా.. పాత పద్ధతిలోనే 50 శాతం రిజర్వేషన్లు దాటకుండా అధికారులు నివేదిక తయారు చేశారని తెలుస్తోంది. బీసీ సంఘాలు, ప్రజల నుంచి వ్యతిరేఖత రాకుండా సీఎం రేవంత్ ప్రణాళిక వేశారని.. మంత్రివర్గంలో క్షుణ్నంగా పరిశీలించి ఓ నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసింది. ఇదే జరిగితే.. పల్లెల్లో ఓట్ల పండుగ నెలకొననుంది.
……………………………………………….
