– ప్రహరీ,నూతన కార్యాలయ భవనం,అంగన్వాడీ భవన నిర్మాణానికి శంకుస్థాపన
– హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్
ఆకేరు న్యూస్, కమలాపూర్:
వ్యవసాయ మార్కెట్ యార్డుల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ అన్నారు. శనివారం కమలాపూర్ వ్యవసాయ మార్కెట్ లో 79లక్షల 50 వేలతో నిర్మించనున్న కార్యాలయ భవనానికి, ప్రహరీ గోడకు ఆయన శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రైతుల కోసం నిరంతరం పనిచేసేది కాంగ్రెస్ ప్రభుత్వమని అన్నారు.వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పుట్టిన రోజున కమలాపూర్ మార్కెట్ యార్డు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడం ఆనందంగా ఉందని ప్రణవ్ అన్నారు.గతంలో ఇదే వ్యవసాయ మార్కెట్ కు పాలకవర్గం లేక ఇబ్బంది పడ్డారని,ఎమ్మెల్సిగా,విప్ గా ఉండి కనీసం పాలకవర్గాన్ని కూడా బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేయలేదని విమర్శించారు.కాంగ్రెస్ ప్రభుత్వం నియోజకవర్గంలోనీ జమ్మికుంట, హుజూరాబాద్, కమలాపూర్ వ్యవసాయ మార్కెట్ లకు పాలకవర్గాలను నియమించి నిధులు కేటాయిస్తున్నామని అన్నారు.
కౌశిక్ రెడ్డి హుజురాబాద్ నియోజకవర్గం పరువు తీస్తున్నాడు
జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారానికి వెళ్లిన హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఓడిపోతున్నామనే భయంతో రాద్ధాంతం చేశాడని దాంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారనీ, ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి దిగజారుడు రాజకీయాలతో హుజురాబాద్ నియోజకవర్గ పరువు తీస్తున్నాడని అన్నారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారని అన్నారు.
అంగన్వాడీ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ప్రణవ్
మండల కేంద్రంలో 12 లక్షలతో నిర్మించే అంగన్వాడీ భవన నిర్మాణానికి ప్రణవ్ శంకుస్థాపన చేశారు. భవన నిర్మాణం త్వరితగతిన పూర్తి చేసి, అందుబాటులోకి తేవాలని కోరారు.ఈ కార్యక్రమంలో కమలాపూర్ వ్యవసాయ మార్కెట్ చైర్ పర్సన్ ఝాన్సీ,వైస్ చైర్మన్ దేశిని ఐలయ్య,డైరెక్టర్లు,కాంగ్రెస్ సీనియర్ నాయకులు,రైతులు పాల్గొన్నారు.
……………………………………………………..
