* రాష్ట్ర రాజకీయాలపై ఆరా తీసిన అగ్రనేత
* జూబ్లీహిల్స్ గెలుపుపై ముఖ్య నాయకులతో చర్చ
* రాష్ట్ర నాయకులను అభినందించిన ఢిల్లీ పెద్దలు
ఆకేరు న్యూస్, డెస్క్ : కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌తో సీఎం రేవంత్ భేటీ అయ్యారు. ఎన్నికకు ముందు సీఎం రేవంత్ రెడ్డిపై ఢిల్లీ పెద్దలు ఆగ్రహంగా ఉన్నారంటూ రకరకాల వార్తాలు వెలువడ్డాయి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక గెలుపు నేపథ్యంలో ఈ భేటీ ప్రాథాన్యత నెలకొంది. తొందర్లో స్థానిక ఎన్నికలకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతుండడంతో.. భవిష్యత్ పరిణామాలపై రాహుల్ చర్చించినట్లు తెలుస్తోంది. అగ్రనేత రాహుల్, కర్నాటక సీఎం సద్ధరామయ్య, ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ సమావేశంలో పాల్గొన్నారు. ఉప ఎన్నికలో గెలిచిన నవీన్ యాదవ్, టీపీసీసీ అధ్యక్షులు మహేష్‌కుమార్ గౌడ్, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కలిసి రాష్ట్ర రాజకీయాలపై చర్చించారు. జూబ్లీహిల్స్‌లో గెలిచిన మరుసటి రోజే రాహుల్‌ను కలవడంతో సీఎం రేవంత్‌పై వచ్చిన ఆరోపణలు కొట్టిపారేసినట్లయింది. తెలంగాణాలో కాంగ్రెస్‌ను అధికారంలోకి తెచ్చేందుకు రేవంత్ రెడ్డి తనదైన పంథాలో ముందుకు సాగుతూ ఢిల్లీ పెద్దల వద్ద ఎదురులేని నాయకునిగా ఉన్నారు.
నాయకులను అభినందించిన రాహుల్..
రాష్ట్ర నాయకులను కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అభినందించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో విజయం సాధించిన నవీన్ యాదవ్‌కు శుభాకాంక్షలు చెప్పారు. కష్టపడ్డ నాయకులకు, కార్యకర్తలకు అండగా ఉంటానని రాహుల్ తెలిపారు. ఇదే ఊపుతో ముందుకు సాగాలని రాహుల్ సూచించారని టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ మీడియాకు తెలిపారు.
…………………………………………
